రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!

Published on Fri, 06/13/2025 - 10:31

వరల్డ్‌ చిన్నతనంలోనే అంజనశ్రీ (Anjana Sri) ప్రమాదవశాత్తు కాలు కోల్పోయింది. కూచిపూడి నాట్యం అంటే ఈ చిన్నారికి ఎంతో ఇష్టం.ఇక నాట్యానికి దూరం కావాల్సిందేనా? ‘లేదు’ అన్నది ఆ చిన్నారిలోని ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కూచిపూడి నాట్యంలో అంజనశ్రీ రాణిస్తోంది.

జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది.... జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి నాగరాజు, గౌతమి దంపతుల కుమార్తె అంజనశ్రీ నాలుగు సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పూర్తిగా కోల్పోయింది.  నాట్యప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని సుధాచంద్రన్‌ నిరూపించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, వాటిని అధిగమించిన తీరును అంజనశ్రీకి కథలుగా చెప్పేవాళ్లు తల్లిదండ్రులు. అంతేకాదు, కూచిపూడి నాట్యకారుడు మచ్చ దేవదాసు వద్ద శిక్షణ ఇప్పించారు. దురదృష్టవశాత్తు రెండోసారి రోడ్డు ప్రమాదం జరిగింది. కుడికాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్‌ చేసి రాడ్‌ వేశారు. అయినప్పటికీ కృంగిపోకుండా కూచిపూడిలో శిక్షణను కొనసాగించింది.

ఇప్పటి వరకు జాతీయస్థాయిలో యాభైకి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది అంజనశ్రీది పేద కుటుంబం. నాన్న బొమ్మకంటి నాగరాజు చిన్నపాటి పాల వ్యాపారం చేస్తున్నాడు. తల్లి గౌతమి గృహిణి.  ‘మా అమ్మాయి కూచిపూడి నాట్యంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు అంజనశ్రీ తల్లిదండ్రులు.

చదవండి: Akhil-Zainab Reception డైమండ్‌ నగలతో, గార్జియస్‌గా అఖిల్‌ అర్థాంగి

ఆ మాటే ధైర్యం చెప్పింది
నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. యాక్సిడెంట్‌లో కాలుపోవడంతో ఇక ఎప్పుడూ డ్యాన్స్‌ చేయలేను అని బాధపడేదాన్ని. నా తల్లిదండ్రులు మాత్రం ‘నువ్వు ఎప్పటిలాగే మళ్లీ డ్యాన్స్‌ చేస్తావు’ అని ధైర్యం చెప్పారు. వారి ఆశీర్వాదబలంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ‘పట్టుదల ఉంటే కానిది లేదు’ అనే మాటను స్కూలు పాఠాల్లో విన్నాను. ఆ మాట నాకు ధైర్యం చెప్పినట్లు అనిపించేది. – అంజనశ్రీ

– కందుకూరి శశిధర్, సాక్షి, జగిత్యాల

చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)