Breaking News

సవాళ్లకు ఎదురొడ్డి, నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్న కశ్మీరీ యువతి

Published on Wed, 06/18/2025 - 12:43

Sania Zehra Success story జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో తన తండ్రి తేనెటీగల పెంపక వారసత్వం నుండి ప్రేరణ పొంది  20 ఏళ్ల వయసులోనే యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తోందో యువతి. ఊహ తెలిసినప్పటి నుంచి తేనెటీగలను చూస్తూ పెరిగింది కశ్మీర్‌లోని బల్హామా నివాసి సానియా జెహ్రా (Sania Zehra). తండ్రి గుల్జార్‌ అహ్మద్‌మీర్‌ తేనెటీగలు పెంచుతుంటే తాను కూడా  ఆసక్తిగా గమనించేది. కానీ కల్తీ ప్రపంచంలో ఆయనకు నష్టాలు తప్పలేదు. దీంతో తానే స్వయంగా రంగంలోకి కశ్మీర్‌లో తేనెటీగల పెంపకాన్ని విప్లవాత్మకంగా  మార్చేసింది.  నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. సానియా జెహ్రా  సక్సెస్‌ గురించి తెలుసుకుందాం పదండి.

కశ్మీర్ సహజ సంపద సారాన్ని కాపాడుతూనే, అభిరుచి, ఆవిష్కరణ ,కృషితో తానేంటో నిరూపించుకుంది సానియా.  ఎంత పెద్ద  విజయానికైనా నాంది   చిన్న ప్రయత్నమే అంటూ స్ఫూర్తిగా నిలుస్తోంది. సవాళ్లను, అడ్డంకులను బద్దలు కొట్టి, వ్యాపారంలో తమ మార్గాలను నిర్దేశించుకుంటున్న కశ్మీరీ మహిళల ప్రతిభకు నిలువటద్దం ఆమె.  తేనెటీగల పెంపకంలో ఛాంపియన్సానియా జెహ్రా. కల్తీ మార్కెట్‌ కారణంగా తండ్రి  గుల్జార్‌ నష్టాల్లో కూరుకు పోయాడు.  దీంతో తానే రంగంలోకి దిగింది. అయితే ఫిజియోథెరపీలో డిప్లొమా చేసిన  తమ బిడ్డ తేనెటీగలను పెంచుతానంటే ఇంట్లో ససేమిరా అన్నారు. అయినా పట్టుదలగా ముందుకు సాగింది. వారిని ఒప్పించింది. జమ్ము-కశ్మీరు హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద రూ.1.50లక్షల  లోన్‌ తీసుకుంది. 

2022లో సానియా ‘కశ్మీర్ ప్యూర్ ఆర్గానిక్స్‌’ను స్థాపించింది. తేనె స్వచ్ఛతను కాపాడటం , వినియోగదారులు, రైతులు ఇద్దరికీ న్యాయమైన ధరలను అందించాలనే లక్ష్యంతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. కేవలం 35 తేనెటీగల కాలనీలతో ప్రారంభించి, వినూత్న పద్ధతులు, అంకితభావం వ్యాపారాన్నిమ ఉందుకు నడిపించింది.  కేవలం రెండేళ్లలో  650 కాలనీలకు విస్తరించింది.ఏటా 5,500 కిలోల తేనె ఉత్పత్తి సామర్థ్యంతో, సానియా వెంచర్ ఇప్పుడు నెలకు రూ. 2 లక్షల టర్నోవర్‌ను సాధిస్తుంది. లాభాలకు మించి, ఆమె వ్యాపారం స్థిరమైన వ్యవసాయం  తేనెటీగల పెంపకంలో అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానికులకు సాధికారత కల్పించింది.  పలువురు యువ వ్యవస్థాపకులకు స్ఫూర్తినిచ్చింది.

‘కశ్మీర్ ప్యూర్ ఆర్గానిక్స్’ ప్రీమియం తేనె రకాల్లో ప్రత్యేకతను సాధించింది. స్వచ్ఛత ,ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీరీ అకాసియా , మోనోఫ్లోరల్ తేనె ఉన్నాయి. సానియా అక్కడితో ఆగలేదు .ఆమె సౌందర్య సాధనాల మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టడం విశేషం. ఏ పనీ చిన్నది కాదు. అంకితభావం, నిజాయితీతో పనిచేసినపుడు  ఆ దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు అంటుంది సానియా. తేనెటీగల పెంపకం తన తాత వ్యాపారం అని, తండ్రి తర్వాత ఇప్పుడు తాను మూడవ తరంగా ఈ వృత్తిలో ఉన్నానని సానియా చెబుతుంది గర్వంగా.

‘‘బోర్‌ కొట్టినపుడు నాన్న గారికి తేనెటీగల పెంపకంలో సాయం చేసేదాన్ని. కానీ దానిలో ఇంత ఆసక్తిని పెంచుకుంటానని , ఉపాధిని  వెతుక్కుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నేడు  చాలా మక్కువతో తేనెటీగల పెంపకం నుండి, తేనె మార్కెటింగ్ వరకు ప్రతిదాన్ని నేనే నిర్వహించుకుంటున్నా’’ సానియా
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)