Breaking News

రూ.5 వేలకు చిరు ఉద్యోగం, అయిదు సార్లు ఓటమి..కట్‌ చేస్తే..!

Published on Mon, 02/26/2024 - 11:13

విజయం సాధించాలంటే ఎంత కష్టమైనా భరించాలి. నిబద్దత,  పట్టుదల ఉంటే చాలు  ఓటమి ఎన్నిసార్లు వెక్కిరించినా  విజయం వచ్చి ఒడిలో వాలుతుంది. కావాల్సిందల్లా సాధించాలనే కసి.  కడు పేదరికం నుంచి కూడా ఓర్పు, అభిరుచి  ఉంటే విజయం సాధించ వచ్చు. అలాంటి సక్సెస్‌ స్టోరీని  తలుసుకుందాం...రండి..!

తమిళనాడులోని కోయంబత్తూర్ పాలక్కాడ్‌కు చెందిన ఆర్‌ ముత్తులక్ష్మి,  ఆర్‌ చంద్రశేఖర్‌ల ఏకైక కుమార్తె రమ్య. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూపెరిగిన రమ్య చదులు రాణించింది. పదవతరగతి  ఆ తరువాత పాలిటెక్నిక్  డిప్లమా చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ,ఆ తర్వాత IGNOUలో ఎంబీఏ చేసింది. 

ఐఏఎస్‌ కావాలను కలలు కంది.ఇంతలో తండ్రి అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంది. బెంగళూరుకు చెందిన ఇన్‌స్ట్రుమెంటేషన్ కంపెనీలో మూడేళ్లపాటు పనిచేసింది. ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్ ఆఫీసర్  కలలు కంది. క్రమంగా  ఆ కల నెర్వేర్చుకోవాలనే పట్టుదలా పెరిగింది. అలా 2017 లో యూపీఎస్సీ నోటిఫికేషన్ రావడం ఆలస్యం, ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నైకి వెళ్లిపోయింది. కానీ  తన ఖర్చులకైనా ఏదో ఒక పని చేసుకోవాలి అందుకే   రోజుకు మూడు గంటలు పనిచేసేలా డేటా ఎంట్రీ ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో ఆమె వేతనం  ఐదు వేలు మాత్రమే.

మిగిలిన సమయాన్ని చదువుకోసం కేటాయించేది. కానీ తొలి పరీక్షలో కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేక పోయింది. అయినా పట్టువీడలేదు. ఐదు సార్లు ఫలితం దక్కక పోయినా ఏ మాత్రం నిరాశ పడలేదు.  అపజయాలే విజయానికి సోపానాలు అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ 2021 లితాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. తల్లి సహకారం, తోడ్పాటుతోనే ఈ విజయం సాధించానంటూ  ఆమో సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం ఆమె ఐఎఫ్ఎస్ అధికారిణిగా  పనిచేస్తున్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)