Breaking News

ఏడేళ్లకే ఆపరేషన్‌ చేసిన వండ‌ర్‌ కిడ్‌!

Published on Sat, 09/06/2025 - 15:44

చిన్నపిల్లలు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడతారు. అక్కడ డాక్టర్‌ తమకు ఇంజెక్షన్‌ ఇస్తాడేమోనని వణికిపోతారు. మందులు మింగాల్సి వస్తుందని, చేదుగా ఉంటాయని అనుకుంటారు. అయితే ఏడేళ్ల వయసులో డాక్టర్‌గా మారి ఆపరేషన్‌ చేసిన బాలుడి గురించి మీకు తెలుసా? అతనే అక్రిత్‌ ప్రాణ్‌ జస్వాల్‌.

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని నూర్పూర్‌ అనే చిన్న పట్టణంలో పుట్టాడు అక్రిత్‌. చిన్న వయస్సు నుండే అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. ఇతర చిన్నారుల కంటే వేగంగా అన్ని అంశాలను నేర్చుకునేవాడు. రెండేళ్ల వయసులోనే పూర్తిగా చదవడం, రాయడం ప్రారంభించాడు. ఐదేళ్ల వయసులో రావాల్సిన సామర్థ్యం రెండేళ్లకే అతనికి సాధ్యమవడం విశేషం. అనంతరం ఆంగ్ల సాహిత్యం, గణితం (Mathematics) వంటి అంశాలను సాధనం చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లకే ఇంగ్లీష్‌ క్లాసిక్‌ పుస్తకాలను చదివాడు.

ఏడేళ్ల వయసులో అక్రిత్‌ ప్రాణ్‌ జస్వాల్‌ (Akrit Pran Jaswal) కీలకమైన విజయం సాధించాడు. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 8 ఏళ్ల బాలిక చేతులపై కాలిన గాయాలతో ఇబ్బంది పడుతుండగా అతను విజయవంతంగా  ఆపరేషన్‌ చేశాడు. అప్పటికే అతను వైద్యరంగానికి సంబంధించిన పుస్తకాలు బాగా చదివి ఉండటం చేత ఆ క్లిష్టమైన శస్త్రచికిత్సను ధైర్యంగా పూర్తి చేశాడు. వైద్యులు అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు.

చ‌ద‌వండి: ఏం చేశావ్‌ పెద్దాయ‌నా.. నీకు సెల్యూట్‌!

ఆ బాలిక గాయాల నుంచి కోలుకోవడంతో అక్రిత్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. విజయవంతమైన ఆపరేషన్‌ (Surgery) చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అనేక ఛానెళ్లు అతని ఇంటర్వ్యూ తీసుకున్నాయి. అలా అతని గురించి ప్రపంచానికి తెలిసింది. స్కూల్‌ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం అక్రిత్‌ ఐఐటీ కాన్పూర్‌లో చేరాడు. అక్కడ కూడా ప్రతిభ చాటుతూ అందరి ప్రశంసలూ పొందుతున్నాడు.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)