Breaking News

మెహిందీకి పర్‌ఫెక్ట్‌ మ్యాచింగ్‌ : మెరిసిపోయిన అందాల భామ

Published on Mon, 02/17/2025 - 19:29

పాకిస్తానీ హీరోయిన్ మావ్రా హొకేన్(Mawra Hocane) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.  తొలుత బుల్లితెరపై కనిపించిన మావ్రా  ఆ తరువాత హీరోయిన్‌గా రాణించింది. ఇప్పటికే తన డ్రీమీ వెడ్డింగ్‌ ఫోటోలతో   ఇంటర్నెట్‌లో సందడి  చేసిన ఈ అమ్మడు  తాజాగా తన మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.  దీంతో ఆమె ఫ్యాషన్‌​  శైలికి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. 

అమీర్ గిలానీ(Ameer Gilani)ని  ఇటీవల(ఫిబ్రవరి 5న) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.  ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు హాజరైన  వివాహానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు  మెహిందీ లగాకే రఖ్‌లీ అంటూ, మెహందీ వేడుక నుండి అనేక చిత్రాలను పోస్ట్ చేసింది. ఇందులో అప్సరసలా మెరిసిపోయింది.  

 గోల్డెన్‌ టోన్ ఎంబ్రాయిడరీ  మస్టర్డ్‌ ఎల్లో -టోన్ ఘరారా సెట్‌ను  ధరించింది.. దీనికి   చిన్న ఫ్రాక్-శైలి కుర్తాతో పాటు ఫ్లేర్డ్ ఘరారాను జత చేసింది. అంతేకాదు  డబుల్-దుపట్టా లుక్‌ లేటెస్ట్‌ ట్రెండ్‌కు అద్దం పడింది.  మెజెంటా దుపట్టా , ఇంకోటి పర్పుల్‌ అండ్‌ బంగారు రంగు దుపట్టాను లుక్‌ను జత చేసింది. ఇక దీనికి జతగా బంగారు ఆభరణాలు, సింపుల్‌ మేకప్ లుక్‌తోతన ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకుంది మావ్రా.  మావ్రా హొకేన్  ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో ఎంబ్రాయిడరీ చేసిన సేజ్ గ్రీన్ షరారా సెట్‌లో  అందంగా మెరిసింది.

కాగా మావ్రా 2011లో ఈ అమ్మడు ‘కిచారి సాల్స’(Kichari Salsa) బాలీవుడ్ రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.  తరువత  2016లో  ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam)తో  నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)