Breaking News

Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!

Published on Thu, 04/24/2025 - 11:23

సాధారణంగా విడాకులను (Divorce) ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక ఫెయిల్యూర్‌గానే పరిగణిస్తున్నారు. కాలమెంత మారినా విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూసే ధోరణి మాత్రం పోలేదు. డైవోర్స్‌ని ఓ అవమానంగా, పరువు ప్రతిష్ఠలకు భంగంగా భావించే పరిస్థితే ఇంకా! అయితే వాయవ్య ఆఫ్రికా దేశమైన మారిటానియా (Mauritania) తీరు ఇందుకు భిన్నం. అక్కడ విడాకులు అంటే ఒక వేడుక. 

ఆ దేశంలోని మారి తెగలోని మాతృస్వామ్య పద్ధతులే ఇందుకు కారణం అంటారు పరిశీలకులు, విశ్లేషకులు. మారిటానియాలో ఒక వివాహిత ఎన్నిసార్లయినా విడాకులు తీసుకోవచ్చు. ఆ విడాకుల సందర్భాన్ని ఒక మెహెందీ, పాటలు, డాన్సులు, విందుతో ఒక సెలబ్రేషన్‌గా నిర్వహిస్తారు. దాని ఉద్దేశం.. ఆ అమ్మాయి మళ్లీ పెళ్లికి సిద్ధంగా ఉందని తెలియజెప్పడమేనట. అమ్మాయిలైతే విడాకులను తమకు దొరికిన స్వేచ్ఛలా భావిస్తారట. విడాకులు తీసుకున్న యువతులు తమ అభిరుచుల్లో  ప్రావీణ్యాన్నిపెంపొందించుకునే ప్రయత్నం చేస్తారట. కొంతమంది పైచదువులు చదువుకుంటారు, కొంతమంది రాజకీయాల వైపు మళ్లుతారు, ఇంకొంతమంది ఆర్టిస్ట్‌లు అవుతారు.. ఇలా తమకు నచ్చిన రంగాన్ని ఎంచు కుంటారు. పిల్లలుంటే వాళ్ల సంరక్షణ తల్లి చాయిసే! 

చదవండి: స్విట్జర్లాండ్‌ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్‌

ఇంకో విషయం ఏంటంటే.. విడాకులు తీసుకున్న ఆడవాళ్లందరికీ ఒక మార్కెట్‌ ఉంటుంది. అందులో వాళ్లింటి సామాన్లన్నిటినీ అమ్మేస్తారు. ఒకరకంగా ఈ మార్కెట్‌ను వాళ్లు తమ స్వేచ్ఛకు ప్రతీకగా భావిస్తారు. పాత భారాన్నంతా దింపేసుకుని కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామనే సూచననిస్తున్నట్టన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం.. మారిటానియాలో కొత్త పెళ్లికొడుకులు డైవోర్స్‌ అయిన మహిళలను చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే సంసారంలో వాళ్లు అనుభవజ్ఞులని. అందుకే పెళ్లికి అక్కడ విడాకుల వనితలకే డిమాండ్‌ ఎక్కువ. మరో ముఖ్యమైన సంగతేంటంటే.. విడాకుల వనితలు మాత్రం విడాకులు  పొందిన పురుషులను చేసుకోరు. కొత్త పెళ్లికొడుకులనే చూస్తారు. విడాకులు పొందిన మగవాళ్లను ఫెయిల్యూర్‌ హజ్బెండ్స్‌గా పరిగణిస్తారట.      

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు