Breaking News

డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్‌ టిప్స్‌

Published on Sun, 08/03/2025 - 13:30

బాలీవుడ్‌ నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా, నటుడు సత్యదీప్‌ మిశ్రా దంపతులు గతేడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డకు స్వాగతం పలికారు. ఓ తల్లిగా బిడ్డతో బిజీ బిజీగా లైఫ్‌ సాగిపోతున్నా.. ఆమె తన ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ని పెట్టడమే కాదు అదనపు బరువుని కూడా తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రతి మహిళ ప్రెగ్నెన్నీలో బరువు పెరగడం సహజం. అయితే ప్రసవానంతరం ఆ బరువుని తగ్గించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయితే మసాబా మాత్రం దాన్ని ఈజీగానే సాధించారు. పైగా డెలివరీ తర్వాత బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తూ..టిప్స్‌ కూడా షేర్‌ చేసుకున్నారు. అవేంటంటే..

ప్రసవానంతరంలో ఆహారంలో కొద్దిమార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సులభం అని అంటోంది. తాను ప్రసవానంతరం ఆరు నెలలు బాదం పాలు, వేయించిన కూరగాయలు, కాల్చిన చేప, ఎల్లప్పుడూ తేనె  బాల్సమిక్ వెనిగ్రెట్(క్రంచింగ్‌ కోసం విత్తనాలు) తీసుకున్నట్లు తెలిపారు. 

వాటి తోపాటు గుడ్లు, వేరుశెనగ, వెన్నటోస్ట్‌, బీట్‌రూట్‌, చికెన్‌, ఓట్స్‌ అంజూర పండ్లు, తదితరాలు తీసుకునేదాన్ని. తల్లిగా బిడ్డకు పాలిచ్చేలా, తన బరువు బ్యాలెన్స్‌ చేసుకునేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్‌నే తీసుకునేదాన్ని అని ఆమె వివరించారు. 

అలాగే కుదిరినంతలో తేలికపాటి వ్యాయామాలు, కెటిల్‌బెల్‌ సెషన్‌ వ్యాయామాలు తదితరాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇవి కండరాల కదలికలకు, ఫ్యాట్‌ని కరిగించడంలో సమర్థవంతంగా ఉంటాయని అన్నారు. అలా తాను పదికిలోలు బరువు తగ్గినట్లు వివరించారామె. స్ట్రాంగ్‌ ఫోకస్‌ ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుందని అంటోంది మసాబా గుప్తా.

(చదవండి: అరుదైన స్ట్రోక్‌తో..మెడుల్లాపై దాడి!)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)