Breaking News

బాయ్‌ ఫ్రెండ్‌తో బాక్సింగ్‌ క్వీన్‌..మేరీ కోమ్‌ మేకప్‌ వీడియో వైరల్‌

Published on Thu, 08/28/2025 - 11:26

ప్రముఖ అథ్లెట్‌,  పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు  వివాహ వేడుకలో బాక్సింగ్‌ సంచలనం మేరీ కోమ్‌  (Mary Kom స్పెషల్‌ ఎట్రాక్షన్‌ నిలిచారు. బాక్సింగ్‌ రింగ్‌ను శాసించిన లెజెండ్‌మేరీ కోమ్‌ గోల్డెన్‌సిల్క్‌ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించి  ఫ్యాన్స్‌తో పాటు పలువుర్ని మెస్మరైజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో  మేరీ  కోమ్‌ షేర్‌ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది.  అంతేకాదు కిర్రాక్‌ ఫోజులతో బాక్సింగ్‌ రింగ్‌లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్‌ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.

మేరీ కోమ్‌ ముస్తాబైంది ఇలా 

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్‌..అద్భుతమైన బాక్సర్‌ ఒలింపిక్‌ మెడల్‌ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.

క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి.  రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్.  2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌ .మేరీకోమ్‌ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు.

 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది  ఏప్రిల్‌లో ప్రకటించారు.

ఎవరీ హితేష్ చౌదరి 
కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్‌  స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్   హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)