Breaking News

మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!

Published on Mon, 10/13/2025 - 10:31

అక్టోబర్, నవంబర్‌లో భారీగా ముహూర్తాలు ఉండడంతో పెళ్లి సందడి షురూ అయ్యింది. షాపింగ్‌ మాల్స్, వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు కొనుగోలు దారులతో సందడి మారుతున్నాయి. రెండు నెలల పాటు పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడం, ఆ తరువాత మూడు నెలల పాటు ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది ఈ రెండు నెలల్లోనే వివాహాలు జరిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు.    – సాక్షి, సిటీబ్యూరో 

నగరంలో పెళ్లి సందడి మొదలైంది.. దీంతో  నగరంలోని ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, కల్యాణ మండపాలకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. ఈ నెలలో ఇప్పటికే మొదటి వారంలో పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు జరిగాయి. అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి నవంబర్‌ 27 వరకూ వరుస ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్‌ 12 నుంచే హడావుడి మొదలైంది. దీంతో పాటు అక్టోబర్‌ 24, 26, 29, 30, 31 తేదీలు, నవంబర్‌ 7, 8, 15, 22, 26, 27 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఆ తరువాత నవంబర్‌ 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ మూఢాలు ఉన్నట్లు చెప్పారు. అంటే నవంబర్‌ చివరి నుంచి డిసెంబర్, జనవరి నెలల్లో ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇంచుమించు మూడు నెలల పాటు వివాహాలు జరిపేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది ఈ రెండు నెలల్లోనే తమ ఇళ్లల్లో భాజా భజంత్రీలు మోగించాలని భావిస్తున్నారు.   

ఇదీ చదవండి: 5 నిమిషాల్లో జాబ్‌ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)