Breaking News

వారి కోసం జుకర్‌బర్గ్‌ ఫ్యావరెట్‌ హుడీ వేలం : మార్క్‌ డ్యాన్స్‌ వైరల్‌ వీడియో

Published on Mon, 03/03/2025 - 17:25

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్  తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును  టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.  బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్‌ దక్కించుకున్న వ్యక్తికి  జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్‌బుక్ స్టేషనరీలో రూపొందించారట.

2019లో  తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్‌లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్‌ టచ్‌,  క్రేజ్‌ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి.  దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది.  దాదాపు 22 బిడ్‌లు వచ్చాయి.  చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది.

 ఇది తన  ఆల్-టైమ్ ఫేవరెట్‌లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్‌మెంట్ కూడా  ప్రింట్‌ అయి ఉంది" అని  గుర్తు చేసుకున్నారు.    ఈ హూడీ 2010 నాటిది.  ఇదే  ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం  సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్‌ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్‌ ఫౌండర్‌  స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా  వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా  దాదాపు రూ. 31 కోట్లకు  బిడ్‌దక్కించుకుంది.  దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.

మార్క్‌ డ్యాన్స్‌, భార్య ఫిదా 
మరోవైపు మార్చి 1న, భార్య  ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా  జుకర్‌బర్గ్  డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్‌ చేశాడు. దీంతో చాన్‌  ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన  జంప్‌సూట్  కూడా ఇలాంటిదేనట.
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)