Breaking News

National Dentists Day : రోజుకు ఎన్నిసార్లు బ్రష్‌ చేయాలి?

Published on Thu, 03/06/2025 - 11:16

నిజామాబాద్‌ నాగారం: మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది దంతాలు. ఆహారాన్ని నమిలి మింగడానికి దోహదప డతాయి. అందుకే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని దంత వైద్యులు చెబుతుంటారు. నోటి శుభ్రతపై నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 
 
ఉదయం, సాయంత్రం సరిగా బ్రష్‌ చేసుకోకపోవడంతో నోట్లో ఆహారం చేరి బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో పుప్పిపళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే కాకుండా నోరు శుభ్రంగా లేకపోతే రోగాలు దరి చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. 
 
దంతాల శుభ్రతలో జాగ్రత్తలు.. 
●దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయాలి. 
● ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. దీంతో పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు పోతుంది. 
● ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 
● మన్నికై న టూత్‌ పేస్ట్‌, టూత్‌ బ్రష్‌లను వాడాలి. 
● చాక్లెట్లు, చిప్స్‌, తీపి పదార్థాలు తినొద్దు.
 
ప్రతి సంవత్సరం మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దంతవైద్యులు మరియు వారు అందించే ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా మార్చి 6న  పాటిస్తారు.  జాతీయ దంతవైద్యుల దినోత్సవ చరిత్ర 20వ శతాబ్దం నాటిది, దీనిని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) అధికారికంగా మొదలు పెట్టింది. దంతవైద్యంలో మైలురాళ్లను స్మరించుకోవడానికి ఈ రోజును పాటిస్తారు. ఉదాహరణకు, 1840లో డాక్టర్ హోరేస్ వెల్స్ మొదటిసారిగా అనస్థీషియాను ఉపయోగించారు. దంతవైద్యులు దంత సమస్యలను నయం చేయడమే కాకుండా నోటి   అనారోగ్యానికి  సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు.
 
 
 
 
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)