Breaking News

ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులవైపు యువత అడుగులు..

Published on Tue, 06/24/2025 - 10:29

కాబోయే ఇంజినీర్లు ఏ విధమైన ఉద్యోగావకాశాలను ఎంపిక చేసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇంజినీరింగ్‌లో ఎలాంటి కోర్సులను కావాలనుకుంటున్నారు? అంశాలపై ఇటీవల కాలంలో బైటెక్సల్‌ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేస్తోంది. ఇందులో మొత్తం లక్ష మంది విద్యార్థులు పాల్గొనగా 62వేల మంది అబ్బాయిలు, 38 వేల మంది అమ్మాయిలు, విద్యార్థినులు ఉన్నారు. 

ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ భవిష్యత్తుపై చాలా స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. ఇంజినీరింగ్‌లో చదివే కోర్సులు, తదుపరి భవిష్యత్తులో చేయాలనుకునే ఉద్యోగావకాశాలపై 40 శాతం మంది విద్యార్థినులు ముందునుంచే సిద్ధమవుతున్నారు. 

అయితే అబ్బాయిల్లో మాత్రం 36శాతం మందికి మాత్రమే భవిష్యత్తుపై స్పష్టతతో ఉన్నారు. కెరీర్‌పై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కనిపిస్తోందని అబ్బాయిలు అభిప్రాయపడుతున్నారు.  

ఆ రెండు కోర్సులంటే.. 
టైర్‌–1 నగరాలైన హైదరాబాద్, పుణె నగరాల్లోని ఇంజినీరింగ్‌ విద్యార్థినిలు ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెరి్నంగ్‌ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. నిత్యనూతనంగా మారుతున్న సాంకేతిక కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్‌ ప్రారంభ దశలోనే తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుంటున్నారు. ఉద్యోగావకాశాల్లోనూ తమ ప్రాధాన్యతలపై స్పష్టతతో ఉంటున్నారు. 

కోడ్‌ ప్రాక్టీస్, ప్రాజెక్ట్‌ వర్క్‌స్పేస్, లైవ్‌ ప్లాట్‌ఫాం డేటా ఆధారంగా భవిష్యత్తు ఇంజినీర్లు ఏరంగాలపై ఆసక్తి చూపిస్తున్నారనే అంశాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విద్యార్థినిలు 66 శాతం మంది అధునాత ప్రోగ్రామింగ్‌ (అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామింగ్‌)కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. 40 శాతం మంది డిఫైన్డ్‌ కెరీర్‌ కోరుకుంటున్నారని తేలింది. అత్యధికంగా 40.58 శాతం మంది విద్యారి్థనులు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. 

భవిష్యత్తు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ఆవిష్కరణలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ, నాగ్‌పూర్, చండీగఢ్, డెహ్రాడూన్‌ వంటి చిన్న పట్టణాలతో పోల్చితే హైదరాబాద్, పుణెల్లో ఏఐ, మెషిన్‌ లెరి్నంగ్‌ కోర్సులపై ఆసక్తి చూపే వారు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు.  

(చదవండి: రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి దిగిన దిగ్గజ క్రికెటర్లు వీరే..!)

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)