Breaking News

ఆరోజు రాత్రి వ‌ర‌కు అబ్బాయి.. లేచిన వెంట‌నే అమ్మాయిగా మార్పు..!

Published on Thu, 06/20/2024 - 17:12

ప్రస్తుతం టెక్నాలజీకి తగ్గ రేంజ్‌లో ఘరానా దోపిడీలు, హైటెక్‌ మోసాలు ఊహకందని విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో మరింత ఘోరం. మనుషులకు తెలియకుండా అవయవాలు దోచేసుకుని వారి జీవితాలను నరకప్రాయంగా మార్చిన ఉదంతాలు కోకొల్లలు. వైద్యో నారాయణ హరిః అన్న వాక్యం వెలవెలబోయేలా ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాంటి దిగ్బ్రాతికర ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..సంజ్‌ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ముజాహిద్‌కి ఆ రోజు రాత్రితో తాను అతడుగా ఉండటం ఆఖరు అని ఊహించలేదు. ఆ రాత్రి తన పాలిట కాళరాత్రిగా మారి జీవితాన్ని శాపంగా మారుస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిద్ర పోయేంతరకు మగవాడిగా ఉన్నవాడు కాస్త మేలుకునేటప్పటికీ 'ఆమె'గా మారిపోయాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. బాధితుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.   ఈ దిగ్బ్రాంతికర ఘటన బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజాహిద్‌ గత రెండేళ్లుగా ఓం ప్రకాష్‌ అనే వ్యక్తి చేతిలో వేధింపులకు గురవ్వుతున్నట్లు తెలిపారు. 

తనతో కలిసి జీవించాలని ఉందంటూ ఓం ప్రకాష్‌ మజిహిద్‌ తనతు చెప్పేవాడని మజిహిద్‌ పేర్కొన్నాడు. అయితే దీన్ని తన సమాజం, కుటుంబం అంగీకరించిందని ముజాహిద్‌ వ్యతిరేకించడంతో బెదిరింపులకు దిగేవాడని వాపోయాడు. అస్సలు తాను ఆస్పత్రికి రాలేదనని ఓం ప్రకాశ్‌నే ఇక్కడకు తీసుకొచ్చాడని చెప్పుకొచ్చాడు. పడుకుని లేచి చూచేటప్పటికీ లింగ మార్పిడి శస్త్ర జరిగిపోయిందని భోరును విలపిస్తున్నాడు ముజాహిద్‌. ఓం ప్రకాష్‌ వైద్యలతో కుమ్మకై తనకు ఈ ఆపరేషన్‌ చేయించినట్లు చెబుతున్నాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్‌ తన వద్దకు వచ్చి మగవాడిని కాస్త స్త్రీగా మార్చాను. "ఇక నువ్వు నాతోనే జీవించాలి లేదంటే నీ తండ్రిని చంపి మీకున్న భూమిని కూడా లాక్కుని లక్నో పారిపోతానని బెదిరించాడని". ముజాహిద్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. 

అంతేగాదు ఆస్పత్రి రికార్డులో సైతం అతడికి ఏదో వైద్య సమస్యతో అక్కడకు వచ్చినట్లు ఉండటం గమనార్హం. ఈ మేరకు బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముజఫర్‌నగర్  పోలీసులు కేసు నమోదు చేసుకుని ఓం ప్రకాష్‌ని అరెస్టు చేయడమే గాక ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్పత్రి సిబ్బందిని కూడా క్షణ్ణంగా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనపై బీకేయూ కార్యకర్తల రైతు నాయకుడు శ్యామ్‌పాల్‌ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మెడికల్‌ కాలేజ్‌ వద్ద నిరసనకు దిగారు. 

ఈ ఆస్పత్రిలో బాధితుల సమ్మతి లేకుండానే అవయవాల మార్పిడి, లింగ మార్పిడి వంటి రాకెట్లు గుట్టుచప్పుడు కాకుండా   జరుగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి దారుణ ఘటన జరగడం బాధకరమని, వెంటనే అందుకు గల బాధ్యుల తోపాటు ఈ ఘటనలో పాల్గొన్న వారిని కూడా గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, పోలీసులు ఆందోళనకారులు నిరసనలను విరమింప చేయడమే కాకుండా ఈ ఘటపై సత్వరమై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

(చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్‌ చేస్తుండగా..అంతలోనే..)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)