Breaking News

62 కిలోలు తగ్గాడు : నీళ్లు, టీ, ఫన్నీ అండ్‌ హెవీ కార్డియో ఇవే సీక్రెట్స్‌

Published on Thu, 06/26/2025 - 16:03

ఒకపుడు బాన పొట్టతో, భారీ బరువుతో ఉన్న యువకుడు పట్టుదలతో తన శరీర బరువును తగ్గించుకున్నాడు.  కండలు  తిరిగే శరీరంతో చూడముచ్చటగా తయారయ్యాడు. 140 కిలోల నుండి 78 కిలోల బరువుకు చేరాడు. అయితే ఇది అంత ఈజీగా ఏమీ సాగలేదు.    ఠినమైన ఆహారం , క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్‌తా మారానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించాడు.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పువి 2023 నవంబరులో తన వెయిట్‌లాస్‌ జర్నీని షేర్‌ చేశాడు.  ప్రధానంగా 'హై-కార్బ్ డైట్' పూర్తిగా పక్కన బెట్టి, ప్రొటీన్డ్‌ ఆహారం, ధారాళంగా నీరు తాగడం ద్వారా  62 కిలోలు తగ్గిన తరువాత, తన దేహం కండలతో కనిపించిందని చెప్పాడు.  


'కార్బోనేటేడ్ డ్రింక్స్‌ చెత్త'
ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ,చక్కెరలను పూర్తిగా తగ్గించేశాడు. కూల్‌ డ్రింక్‌లు, చక్కెర కార్బోనేటేడ్  డ్రింక్‌లకు బై బై  చెప్పేశాడు. అవి చెత్త తప్ప వాటిల్లో ఏమీలేదంటాడు పువి. పుష్కలంగా నీళ్లు, అప్పుడప్పుడు టీకి మాత్రమే పరిమితమయ్యాడు. చాలా రోజులు  కూరగాయలు,  చాలా సింపుల్‌గా మసాలా దినుసులతో  ఉడికించిన చికెన్‌  తినేవాడు.

 'ట్రెడ్‌మిల్ కాదు కానీ ఫన్ కార్డియో'
బరువును తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రొటీన్‌ ఫుడ్‌పై  దృష్టిపెట్టాడు. వారానికి 4 సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్‌తోపాటు, చేయ గలిగినంత కార్డియో(ట్రెడ్‌మిల్ కాదు) ఫన్ కార్డియో చేసేవాడు.  హెవీ బ్యాగ్ కొట్టడం, స్కిప్పింగ్, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) ఇలా ప్రతీదీ ఆస్వాదిస్తూ  వెయిట్‌లాస్‌ జర్నీని కొనసాగించాడు.  లావుగా ఉన్నానని నా బాడీని, జీవితాన్ని ద్వేషించ లేదు, కానీ ఫిట్‌గా మారాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఏమి తిన్నా, ఎంజాయ్‌ చేస్తూ, ఉపయోగపడేలా తినాలి అంతే అంటాడు పువి.  

నోట్‌: బరువు తగ్గాలనే కోరికతో పాటు,దానికి తగిన ప్లాన్‌, ఆహార అలవాట్లు ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీవ్రంగా జిమ్‌ చేయాలంటే నిపుణుడైన శిక్షకుడి ఆధ్వర్యంలోనే చేయాలి. దీనికంటే ముందు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో విశ్లేషించుకోవాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)