Breaking News

చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..!

Published on Sun, 05/24/2026 - 15:17

మోడు వారిని భూమిని కొంచెం మనసుపెట్టి, శ్రమించి పచ్చదనంతో కళకళలాడేలా చేయొచ్చు. అదే ఎడారిలో అంత ఈజీకాదు. చాలామటుకు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎడారిలో అడవిని పెంచడం మాటల్లో చెప్పినంత సులభం అస్సలు కాదు. ఒక వేళ పెంచినా.. మనుగడ సాధించగలడంమనేది ప్రశ్నార్థకమే. అలాంటిది సుసాధ్యం చేసి చూపించింది ఓ మహిళ. ఆనాడు ఆ చేస్తున్న పనికి సాయం అందిస్తూ కూడా..ఎడారిలో పచ్చదనం వస్తుందా అన్న ప్రశ్న ఎదురైన వెరవక ముందుకు సాగిన పచ్చని తల్లి ఆమె.

అంతర మంగోలియాలోని మావోవుసు ఎడారిలో ఎడారీకరణను ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా చెట్లను నాటుతోంది చైనాకు చెందిన 60 ఏళ్ల యుజెన్‌. 1980లలో వివాహం అనంతరం భర్తతో కలిసి మంగోలియాలోని మావోసు ఎడారికి వెళ్లింది. ఆ ప్రదేశం బలమైన గాలులు, కరువుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. అలాంటి వాతావరణంలో నివశిస్తూ..ఎడారి వ్యాప్తిని ఆపేలా చెట్లను నాటే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. ఆ పని అత్యంతకష్టమైనప్పటికీ ఆ జంట ఏళ్ల తరబడి ఆ ప్రయత్నం కొనసాగించింది. 1996లో ఆమె కథ చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో ప్రసారమైంది. 

దాంతో ఒక్కసారిగా యుజెన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆమె అంకిత భావానికి స్ఫూర్తి పొందిన రోనాల్డ్‌ సకోల్స్కీ అనే అమెరికన్‌ ఉపాధ్యాయుడు ఆమె లక్ష్యానికి మద్దతుగా సుమారు రూ. 4,80,000 ఇచ్చాడు. అంత పెద్ద మొత్తం చూసి ఆశ్చర్యపోయిన యుజెన్‌..ఆ డబ్బులు మొత్తం మొక్కలు నాటేందుకే వినియోగించింది. సకోల్స్కీ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ స్కూల్‌లో పనిచేస్తుండేవారు. ఆయన ఒక రోజు ఎడారిలో మొక్కలు నాటుతున్న యుజెన్‌ను చూసి అబ్బురపడ్డారు. 

కానీ ఆమె ప్రయత్నం సాధ్యమవుతందా? లేక నిరర్థకం అవుతుందో? తెలియదు గానీ..తన వంతుగా మద్దతు అంటూ అంత సొమ్ము ఇచ్చారాయన.  కాలక్రమేణ ఎడారిలో 50 వేలకు పైగా చెట్లు పెరిగి బీడు వారిని ఎడారి కాస్తా పచ్చని భూమిలా కనువిందు చేయడం ప్రారంభించింది. ఆ అడవిని ఎలాగైనా.. ఆ ఉపాధ్యాయుడు సకోల్స్కీకి చూపించాలని యుజెన్‌ ఎంతో ప్రయాసపడి సదరు స్కూల్‌ సాయంతో అతడి ఆచూకిని తెలుసుకుని మరి ఆ అడవిని చూసేందుకు ఆహ్వానించింది. అతను ఆ ఆహ్వానానికి ఉబ్బితబ్బిబవ్వుతూ..ఆ ఫలితాన్ని చూడాలని ఎంతో కుతూహలంగా ఉందని చెప్పాడు. 

ఈ కథ చైనాలోని ప్రతిఒక్కరిని కదలించింది. యుజెన్‌ ప్రయత్నమే అభినందనీయం అనుకుంటే.. ఆయన ఆమె ప్రయత్నానికి మద్దుతివ్వడం మరింత విశేషం. పైగా చాలామంది దీనిని సరిహద్దులు దాటి చూపిన దయ, నమ్మకం, సహకారానికి సంబంధించి..హృదయాన్ని తాకే కథగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పర్యావరణ ప్రయత్నాల ద్వారా ఇటీవల సంవత్సరాలలో ఎడారీకరణకు గురైన భూమిని తగ్గించడంలో చైనా గణనీయమైన పురోగతి సాధించిందని అధికారులు కూడా పేర్కొన్నారు.

(చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌)

 

#

Tags : 1

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)

+5

రామ్‌చరణ్‌ 'పెద్ది కీ ఆవాజ్‌' ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)

+5

కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)