Breaking News

పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌

Published on Tue, 02/24/2026 - 11:00

పిల్లలను పెంచడం అనేది ఓ కళ, అది అతిపెద్ద బాధ్యత కూడా. అదొక్కటి కరెక్ట్‌గా ఉంటే..వాళ్ల భవిష్యత్తు కోసం బెంగ పడాల్సిన పని ఉండదు. కానీ ఇక్కడే ప్రతి పేరెంట్‌ తప్పటడుగులు వేస్తుంటారు. తమ పిల్లలనే అతిప్రేమ వల్లనో..అతిగారభం వల్లనో కొన్ని బాధ్యతలను నేర్పించడంలో విఫలమవుతుంటాం. తర్వాత బాధపడేది కూడా మనమే. కానీ ఇక్కడో తండ్రి..కోపం, మందలింపు చర్యలతో పనిలేకుండా చాలా సున్నితంగా..వ్యర్థాలను పడేయకూడదని చెప్పిన తీరు అందరీ మనసులను దోచుకుంది. ఇలా కదా పిల్లల్ని పెంచాలి అని అంతా మెచ్చుకునేలా ఉంది అతడి పేరెంటింగ్‌ స్టైల్‌. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

ట్రావెల్‌ వ్లాగర్‌ దీపక్‌ సమల్‌ తన కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న వీడియోని షేర్‌చేశాడు. తన కొడుకు రైలులో చిప్ప్‌ తింటూ కింద చెల్లాచెదురుగా పడేస్తాడు. ఆ తర్వాత నాన్న వాటిని ఎవరు తీస్తారు అని అమాకంగా అడుగుతాడు కొడుకు. దాంతో ఇదేమి మన ఇల్లు కాదు. ఈ క్షణం మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి అది మనది. ఆ తర్వాత మరొకరిది. మనం పాడు చేస్తే..మనమే క్లీన్‌ చేయాలి. 

ఈ రైలు అందరిది. అని చెబుతాడు. వెంటనే ఆ చిన్నారి కాసేపు నిస్సహాయంగా ఉండిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా వంగి ఒక్కో చిప్‌ని తీస్తూ శుభ్రం చేస్తాడు. అక్కడ ఆ తండ్రి ఓరేయ్‌ మొత్తం చెత్త వేశావ్‌, పాడు చేశావ్‌..అని అరవడం గానీ, తిట్టడం గానీ చేయలేదు. జస్ట్‌ తను చేసిన తప్పుని వివరించాడు. అది ఇతరులకు ఎలా ఇబ్బందిగా మారతుంది..మన బాధ్యత ఏంటో ఆ చిన్ని మనసుకి అద్దమయ్యేలా చెప్పిన తీరు చాలా బాగా ఆకట్టుకుంటుంది. 

పైగా మన చెత్త మన బాధ్యత అని తన కొడుకుకి సివిక్‌ సెన్స్‌ని చాలా సున్నితంగా నేర్పించాడు ఆ  తండ్రి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం గుడ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అయినా రైళ్లను శుభ్రంగా ఉంచడం అనేది కేవలం సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు మనందరి ఉమ్మడి బాధ్యత. అందురూ తప్పక తెలుసుకోవాల్సింది , నేర్చుకోవాల్సింది కూడా అంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: కుక్క మొరగడంతోనే.. పెళ్లి ఆగిపోయింది..! ట్విస్ట్‌ ఏంటంటే..)

 

Videos

భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!

బయటపడ్డ బ్యూటీ బండారం.. నిమిషాల్లోనే 1.4 లక్షల ఫాలోవర్లు గాన్..!

పులివెందుల చేరుకున్న జగన్

తేజస్ యుద్ధ విమానాలపై అనుమానాలు క్లారిటీ ఇచ్చిన HAL

వరల్డ్ ఫేమస్ హలీమ్ తయారీ.. పిస్తా హౌజ్ లో

జగన్ చేతుల మీదుగా రేపే నందీశ్వరాలయం ఓపెనింగ్

Ram Role: ఇటు మహేశ్.. అటు రణబీర్ ఎవరు పర్ఫెక్ట్?

జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)

+5

అమెరికాలో విరుచుకుపడుతున్న మంచు తుపాను (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

గుర్తుపట్టలేని విధంగా సీనియర్ నటి.. మేకప్‌ తీయడానికే 2 గంటలు (ఫోటోలు)

+5

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం (ఫొటోలు)

+5

సోమాజిగూడలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)