Breaking News

ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!

Published on Fri, 12/29/2023 - 13:43

అతను ఐఐఎం, ఐఐటీలు వంటవి ఏం చెయ్యలేదు. కానీ వేతనంగా ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజిని అందుకుంటున్నాడు. మరీ అంత వేతనం ఎలా? అని అనుకుంటున్నారా!.. పనిచేసే అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన పని లేదు అని నిరూపించాడు ఈ భారతీయ విద్యార్థి. 

వివరాల్లోకెళ్తే..భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్‌ అనే చిన్న జిల్లాలో నివసించే మహిపాల్ సేజు అనే భారత విద్యార్థి ఓ జపాన్‌ కంపెనీ నుంచి కోటి రూపాయల వార్షిక ప్యాకేజీని అందుకుని రికార్డు సృష్టించాడు. అయితే అతను ఏమి ఐఐఎం, ఐఐటీ స్టూడెంట్‌ కాదు. అందరిలానే బీటెక్‌ డిగ్రీ పూర్తి చేసి ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకుని ఆశ్చర్యపరిచాడు. కేవలం పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని ప్రూవ్‌ చేశాడు.

మహిపాల్‌ జోథ్‌పూర్‌లోని బార్మర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో  బీటెక్‌ పూర్తిచేశాడు. అయితే బీటెక్‌ చదువుతుండగానే 2019లో ఓ ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా జపాన్‌లో నగోయాలోని ఒక కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీతో మొదటి ఉద్యోగాన్ని సంపాదించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత జపాన్‌లోని టోక్యోలో మరో కంపెనీతో ఏకంగా రూ. 1 కోటి వార్షిక ప్యాకేజ్‌ ఆఫర్‌ అందుకుని రికార్డు సృష్టించాడు.

మహిపాల్‌ ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద చదువులు చదవలేదని బాధపడాల్సిన పనిలేదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యే స్కిల్స్‌ సంపాదించుకుంటే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చని మహిపాల్‌ చేసి చూపించాడు. నిజం చెప్పాలంటే ఫోకస్‌ కరెక్ట్‌గా ఉండి, పనిపై అంకితా భావం ఉంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినా కోట్లలో వేతనం అందుకోగలమని చాటి చెప్పాడు, పైగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మహిపాల్‌ సేజు.

(చదవండి: ఇందిరా గాంధీ బ్రేక్‌ ఫాస్ట్‌గా కోసం ఓ చెఫ్‌ పడ్డ పాట్లు! కానీ చివరికి..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)