Breaking News

ఈ పెళ్లికి యాచకులే వీఐపీలు!

Published on Sat, 01/03/2026 - 07:18

పెళ్లికి బంధువులు, స్నేహితులను పిలవడం కొత్తేమీ కాదు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజిపూర్‌కు చెందిన సిద్దార్థ్‌ తన సోదరి వివాహానికి యాచకులను స్పెషల్‌ గెస్ట్‌లుగా ఆహ్వానించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేసిన ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

తన సోదరి వివాహనికి హాజరైన యాచకులను సిద్దార్థ్‌ ఆత్మీయంగా ఆహ్వాస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. వారు విందుభోజనాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తాయి.

అలాంటి ఖరీదైన, రుచికరమైన భోజనాన్ని తినడం వారిలో చాలామందికి అదే మొదటిసారి.

కడుపు నిండా భోజనం చేసిన యాచకులలో కొందరు సంతోషంతో నృత్యం చేశారు!

వివాహానికి కొన్నిరోజుల ముందు సిదార్థ్‌ వివిధ ప్రాంతాలకు పనిగట్టుకుని వెళ్లి మరీ యాచకులను ఆహ్వానించాడు.

‘ఈ యాచకులలో ఎంతమంది అర్ధాకలితో ఉన్నారో, ఎంతమంది కొన్నిరోజుల పాటు భోజనానికి దూరమయ్యారో. ఇలాంటి దీనులకు వరంలాంటి పెళ్లివిందు ఇది’

‘అంతులేని ఆడంబరాలతో, అనవసర ఖర్చుతో మన దేశంలో వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఒక్క రోజైనా పెళ్లి విందు రూపంలో దీనుల కడుపు నింపడం అద్భుతమైన పని’

‘విందు భోజనాల సమయంలో యాచకులు కనిపిస్తే విసుక్కుంటూ వారిని దూరంగా తరిమే దృశ్యాలను చాలా చూశాను. ఇలా మనసును కదిలించే దృశ్యం చూడడం ఇదే తొలిసారి’

‘మానవత్వానికి అద్దం పట్టే అరుదైన వీడియో’... ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. 

Videos

'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు

Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు

NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!

Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం

Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..

ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే.. ఒక్క మాటతో బాబు చాప్టర్ క్లోజ్

Photos

+5

గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)

+5

జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే