Breaking News

బరువు పెరగాలనుకుంటే ఇలా తినండి..! 45 కిలోలు నుంచి 87 కిలోలు..

Published on Thu, 08/21/2025 - 17:00

కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్‌ క్రియేటర్‌ సుజీత్‌ చౌరాసియా. సోషల్‌ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్‌ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!. 

కంటెంట్‌ క్రియేటర్‌ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్‌తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్‌ ఎలా సెట్‌  చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్‌ చేసేలా ఒక లీటర్‌ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్‌ రిచ్‌ స్టార్‌ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు. 

ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్‌ స్పూన్‌ పీనట్‌ బటర్‌, ప్రోటీన్‌ బూస్ట్‌ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్‌తో 4 బ్రెడ్, మిల్క్‌షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో చేసిన మిల్క్‌ షేక్‌. 

లంచ్‌ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్‌, విటమిన్ల కోసం సలాడ్‌ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్‌కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్‌ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్‌ విధానాన్ని పోస్ట్‌లో వివరించాడు. 

మెరుగైన ఫలితాల కోసం..

భోజనం పరిమాణం పెంచుకోవడం

హైడ్రేట్‌గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండి

ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర

వ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం

 

(చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి)

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)