Breaking News

మలైకా తండ్రిది ఆత్మహత్యా? ప్రమాదమా? తల్లి ఏమన్నారంటే?

Published on Wed, 09/11/2024 - 18:37

బాలీవుడ్‌లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్‌నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్‌. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. 

మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు.  బిల్డింగ్ వాచ్‌మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు  మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు. 

విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్‌ గా మారింది.  మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్   కూడా అక్కడికి  చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్‌ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్‌ ఫ్రెండ్‌ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)