Breaking News

25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్‌ స్టోరీ

Published on Mon, 04/21/2025 - 15:13

పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. పుట్టాక   పుట్టుకతోనే అంధురాలైన ఈ బిడ్డ మా కొద్దు అంటూ చెత్త కుప్పలో పడేశారు తల్లిదండ్రులు . కట్‌ చేస్తే 26 ఏళ్ల వయసులొ నాగ్‌పూర్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్‌. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్‌లో చెత్తబుట్టలో పడేశారు  కన్నవాళ్లు.  ఆ  చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న  చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో  ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్  అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుని సత్తా చాటుకుంది. గత ఏడాది మేలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) క్లర్క్-కమ్-టైపిస్ట్ పరీక్ష (గ్రూప్ సి)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాలా పాపల్కర్ వార్తల్లో నిలిచింది. తాజాగా  అంత్యంత పోటీతత్వ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.  త్వరలోనే నాగ్‌పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనుంది.

చదవండి: మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు

మాలా పాపాల్కర్‌  ఎలా ఎదిగింది.

అనాథాశ్రమంలో చేరిన మాలానుపద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ శ్రద్ధగా గమనించేవారు.  ఆమె పట్టుదల, నైపుణ్యానికి ముచ్చటపడ్డారు. ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్‌ అని పేరు పెట్టారు.  ఆమె  ఉన్నత  చదువులు చదివేందుకు తన  వంతు కృషి  చేశారు.  అలా  మాలా పట్టుదలగా  చదివింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్‌లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది.  తాజా మరో మెట్టు అధిగమించింది.

‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆ దేవుడే  దేవదూతలను పంపించాడంటూ  తన విజయానికి  కారణమైన వారికి  కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్‌ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్  దత్తత తీసుకున్నారు.

చదవండి: వేధింపులకు భయపడి పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్‌ చేస్తే ఆర్మీ మేజర్‌!


 

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?