Breaking News

నా దారి రహదారి

Published on Thu, 01/30/2025 - 04:33

అవని నుంచి అంతరిక్షం వరకు మహిళలు అసాధారణ విజయాలు సాధించి తమ సత్తా చాటుతున్నా.... ఇంకా లింగవివక్షతతో కూడిన బోలెడు ఆశ్చర్యాలు మిగిలే ఉన్నాయి. ఫిలింనగర్‌ బస్తీలో మక్కల మాధవి బస్‌ డ్రైవర్‌గా స్టీరింగ్‌ పట్టినప్పుడు... ‘ఇదేందీ!’ అని  ఆశ్చర్యపోయిన వాళ్లే ఎక్కువ. ‘పెద్ద బస్పు నడపడం నీ వల్ల ఏమవుతుందమ్మా!’ అని  నిరాశ పరిచిన వారే ఎక్కువ. అయినా సరే...‘నా దారి రహదారి’ అంటూ మాధవి దూసుకువెళుతూ తన డ్రైవింగ్‌ స్కిల్స్‌తో శభాష్‌ అనిపించుకుంటోంది...

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్‌ బస్తీలో నివసించే మక్కల మాధవి భర్త రాజేష్‌ ‘జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌’ బస్సు డ్రైవర్‌గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇదే బస్సులో మాధవి అటెండర్‌గా పని చేసేది. భర్త బస్సు నడుపుతున్న తీరు చూసి డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. స్కూల్‌ మైదానంలో భర్త ద్వారా డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకొని ఏడాది క్రితం నుంచే బస్సు నడపడం మొదలుపెట్టింది. స్కూల్‌ చైర్మన్, ప్రిన్సిపాల్‌తోపాటు టీచర్లు కూడా ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ప్రోత్సహించారు. పూర్తి అనుభవం వచ్చాకే స్కూల్‌ బస్సు నడుపుతానని జేహెచ్‌పీఎస్‌ యాజమాన్యానికి తెలియజేసింది.

డ్రైవింగ్‌ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన మాధవిని చూసి ‘బక్కపల్చగా ఉన్న ఈమె బస్సు ఏం నడుపుతుంది!’ అని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా బస్సు నడపడానికి తిరస్కరించారు. అయితే మాధవి ఏమాత్రం నిరాశ పడలేదు. మూడోసారి వెళ్ళి ఒకసారి తాను బస్సు నడపడం చూడాలని, నచ్చకపోతే లైసెన్స్ ఇవ్వొద్దని వేడుకుంది. ఎత్తు, ఒంపుల్లో బస్సును నడిపించి ఎలాగైనా అనర్హురాలిగా చేసి పంపాలనుకున్న అధికారులు మాధవి బస్సు నడిపించే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. పరీక్షలో పాస్‌ కావడంతో మాధవికి డ్రైవింగ్‌ లైసెన్స్ మంజూరు చేశారు. స్కూల్‌ యాజమాన్యం కూడా ఆమెను మరింత ప్రోత్సహిస్తూ  పిల్లలను తీసుకురావడం, ఇంటి దగ్గర దింపేందుకు బస్సు నడిపే బాధ్యతను అప్పగించింది. 
 

గో ఎ హెడ్‌
డ్రైవింగ్‌ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త కాస్త  భయపడ్డాడు. అయితే నాకు నేర్పించే క్రమంలో గ్రౌండ్‌లో నా డ్రైవింగ్‌ చూసి ఆయనకు భయం పోయింది. దీంతో మెల్లమెల్లగా ప్రతిరోజూ అదే గ్రౌండ్‌లో రెండు గంటలపాటు డ్రైవింగ్‌ప్రాక్టిస్‌ చేసేదాన్ని. బస్సు డ్రైవింగ్‌ పూర్తిగా వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కూల్‌ యాజమాన్యం, టీచర్లు వెన్ను తట్టి ప్రోత్సహించడం, బస్సు నడుపుతున్నప్పుడు గో ఏ హెడ్‌ అని పిల్లలు అరవడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
– మక్కల మాధవి 

– పురుమాండ్ల నరసింహారెడ్డి,
సాక్షి, హైదరాబాద్‌

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు