టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?
Breaking News
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఇంగ్లిష్ యాదవ్ చాచా
Published on Sun, 07/14/2024 - 06:25
ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు.
ఇతడిని ‘ఆటోడ్రైవర్ యాదవ్ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్ యాదవ్ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్.
#
Tags : 1