Breaking News

పూసల దండలు అమ్మే అమ్మాయి నగల షాపు ఓపెనింగ్‌కి గెస్ట్‌గా..!

Published on Sun, 02/16/2025 - 08:34

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయినిగుర్తు పట్టారా? కేరళలో ఒక నగల షాపుకు ఓపెనింగ్‌కు వచ్చింది. అంటే డబ్బు ఇచ్చి పిలిపించి ఆమె చేత ఓపెనింగ్‌ చేయించారు. తమాషా చూడండి. రోడ్డు మీద కూచుని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్‌కు రిబ్బన్‌ కత్తిరించడం. సోషల్‌ మీడియా గొప్పతనం అలా ఉంది. మీకర్థమైంది కదా.. ఈ అమ్మాయి మోనాలిసా. మెడలో పూసలు వేసుకుని తిరిగే అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్‌ను కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహిస్తుందా? అదే జరిగింది. అదే మేజిక్‌.

కుంభమేళాకు పూసలమ్ముకోవడానికి వచ్చిన 16 ఏళ్ల మోని భోంస్లే తన అందమైన కళ్లతో ప్రపంచాన్నే ఆకర్షించింది. ఆమె ఫొటోలు సోషల్‌ మీడియా తోపాటు ప్రొఫెషనల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయ్యాయి. ‘మోనాలిసా’ పేరుకు రాత్రికి రాత్రి  ఇన్‌స్టాలో ఆమె ఫాలోయెర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన మోని భోంస్లే ఇప్పుడు సెన్సేషన్‌. ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్‌ చేసిందని వార్త. 

ఇక ఇప్పుడు షోరూమ్‌ల ప్రాంరంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటోంది. కేరళ కోజికోడ్‌కు చెందిన జ్యువెలరీ షోరూమ్‌ను వాలెంటైన్స్‌ డే రోజున మోని భోంస్లే రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్‌ ఒక ఖరీదైన నెక్లెస్‌ను కాసేపు మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు. ఆమెరాకతో ప్రచారం బ్రహ్మాండంగా దొరికింది. 

బదులుగా ఆమెకు మంచి పారితోషికం లభించింది. విమానాలలో, లగ్జరీ కారుల్లో ఇప్పుడు మోని భోంస్లే తిరుగుతోంది. సోషల్‌ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేము. టాలెంట్‌ ఉంటే జనానికి చేరడానికి సోషల్‌ మీడియా ఉంది. దానిని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్‌ మీడియాలో మెజారిటీ సెంటిమెంట్స్‌కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోతాము. 

కనుక ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నంబర్‌ 1 యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అహ్లాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మరో విషయం ఏమిటంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాలు వెల్లడి చేయకుండా సోషల్‌ మీడియాలో కేవలం మన టాలెంట్‌ను, కళను, ప్రతిభను చూపాలి. స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం కలిసొస్తే మోనాలిసా లాంటి ఫేమ్‌ పెద్ద కష్టం కాదు. 

 

(చదవండి: కోళ్ల అందాల పోటీలు..!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)