Breaking News

Maha Kumbh Mela 2025 : గర్ల్‌ ఫ్రెండ్‌ సలహాతోనే పెట్టుబడిలేని వ్యాపారం

Published on Thu, 01/30/2025 - 16:15

ప్రముఖ ఆధ్యాత్మిక  కార్య​‍క్రమం  మహా కుంభమేళా  అశేష భక్తకోటితో ఉత్సాహంగా సాగుతోంది. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే  సుదూర తీరాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (MahaKumbhMela 2025)కు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా హృదయాలను హత్తుకునే సంఘటనలు, కథనాలు ఆకర్షిస్తున్నాయి.  

మరోవైపు బడా వ్యాపరస్తులతోపాటు ఇక్కడ చిన్నా, చితకా వ్యాపారం చేసుకునేందుకు అనేకమంది ప్రయాగరాజ్‌కు వస్తున్నారు. వీరిలో  రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముకునే మోనాలీసాలాగా పాపులర్‌ అవుతున్నారు.  ఈ కోవలో ఒక ప్రేమికుడు నిలవడం విశేషం.  స్నేహితురాలు ఇచ్చిన సలహాను తు.చ. తప్పకుండా పాటించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్  అయింది.  ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. పెట్టుబడి లేని వ్యాపారంగా వేప పుల్లల్ని విక్రయిస్తూ ఆకర్షణీయమైన  ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రియురాలిచ్చిన సలహా ఆధారంగా రంగంలోకి దిగిన అతగాడు రోజూ పొద్దున్నే అక్కడ వేపపుల్లల్ని విక్రయిస్తున్నాడు. తద్వారా గత  ఐదు రోజుల్లో  40వేల రూపాయలు  సంపాదించాడు.  ఈ సందర్భంగా సంతోషం నిండిన కళ్లతో అతను చెబుతున్న మాటలు  అనేకమంది  హృదయాలను హత్తుకుంటున్నాయి.

‘‘ఆమె(తన ప్రేయసి) కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. తానే మహాకుంభ మేళాకు వెళ్లమని చెప్పింది. పెట్టుబడి అవసరం లేదు కాబట్టి ఆ క్షేత్రంలో వేపపుల్లలు అమ్మమని సలహా ఇచ్చింది. నేను ఆమె కారణంగా ఇంత  సంపాదించాను’’ అంటూ  చెప్పుకొచ్చాడు సంతోషంగా.

“నిజమైన బంధం” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్‌ అయిన ఈ కథనంపై  నెటిజన్లు  వారి ప్రేమను అభినందించారు. నిజమైన ప్రేమ, ఎంత హృద్యంగా ఉంది లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. "ఇంత అద్భుతమైన స్నేహితురాలిని ఎప్పుడూ వదులుకోవద్దు లేదా మోసం చేయవద్దు" అని ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు రాశారు."చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడుతున్నాడు. మీరు జీవిత మార్గంలో విజయంలో అగ్రస్థానానికి చేరుకుంటారు" అని మూడవ వ్యక్తి వ్యాఖ్యానించాడు.ఒక్క క్షణం కూడా తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడలేదు సూపర్‌ అని  మరొకరన్నారు. చూశారా.. ప్రియురాలు గురించి చెప్పేటపుడు అతని ముఖంలో వెలుగు,  మాటల్లో గర్వం, ఆ స్వరంలో ప్రేమ ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయో..ఇదే రా ప్రేమంటే అంటూ  మరికొంతమంది కమెంట్‌  చేశారు. 

ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ : తీసుకున్నోడికి తీసుకున్నంత!

 ప్రపంచంలోనే అతిపెద్ద  ఆధ్యాత్మిక సమాహారంగా  భావించే మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది  ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ  పవిత్ర కార్యంలో సన్యాసులు, సాధువులు, సాధువులు, సాధ్విలు ప్రముఖంగా నిలుస్తుండగా,  దేశ విదేశాలకు చెందిన  పలువురు భక్తులతోపాటు, అన్ని వర్గాల ప్రజలు  తరలివస్తున్నారు.  గంగా, యమున ,సరస్వతిల పవిత్ర సంగమమైన సంగమంలో స్నానం చేసి తరలించాలని భక్తుల ఆకాంక్ష.

ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్‌ లవ్‌ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)