Breaking News

ఇల్లు పొమ్మంది.. ఊరు రమ్మంది

Published on Tue, 07/14/2026 - 13:38

మహబూబ్‌నగర్‌ రూరల్‌:  కులాంతర వివాహం చేసుకోవడం.. కన్న తల్లిదంద్రులే కూతురును కాదనుకున్నారు. ఆమెకు చెందిన సామాజికవర్గం కూడా దగ్గరకు రానివ్వలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా కరుణించలేదు. అయితేనేం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని మురిసిపోయింది.. ఆ ఆశలు కానీ, ఇంతలోనే విధి వక్రీకరించింది. ప్రాణానికి ప్రాణమైన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆ యువతి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భర్త తరపు వారు కూడా వేధింపులకు గురిచేయడంతో ఆమె వేదన.. అరణ్యరోదనగా మారిపోయింది. 

2017లో కులాంతర వివాహం.. 
వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రేణుక, అదే గ్రామానికి చెందిన విజయ్‌ ప్రేమించుకొని.. 2017లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యువతి అమ్మానాన్నలు ఆమెను కుటంబం నుంచి వెలివేశారు. కనీసం ఇంటి దగ్గరకు కూడా రానివ్వకపోగా.. ఫోన్లో సైతం మాట్లాడటం లేదు. అయితే అప్పటికే జీవితంలో స్థిరపడిన భర్త విజయ్‌ 2012లోనే రామాపురంలో విజ్ఞాన్‌ కాన్సె ప్ట్‌ స్కూల్‌ను స్థాపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులతో పాఠశాల బాగా నడిచేది. అయితే అప్పటికే విజయ్‌ సోదరుడు, కుటుంబ సభ్యులకు ఆ స్కూల్‌పై కన్ను పడింది.

 ఈ క్రమంలోనే 2019 మే 11న గ్రామానికి చెందిన ఓ యువకుడి శుభకార్యానికి వెళ్లగా అప్పట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్‌తో సహా 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో భర్త తరపున బంధువులు వేధింపులు మొదలయ్యాయి. విజయ్‌ మృతితో భార్య రేణుకకు రావాల్సిన పథకాలేవి భర్త ఇంటి సభ్యులు ఆమెకు దక్కనివ్వలేదు. భర్త స్థాపించిన స్కూల్‌ను సైతం లాక్కొని వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారు. పాఠశాల లైసెన్స్,        రిజి్రస్టేషన్‌ సైతం రేణుక పిల్లల పేరు మీదనే ఉన్నప్పటికీ ఆమెను దరిదాపుల్లోకి రానివ్వ లేదు. అయినప్పటికీ రేణుక తల్లిదండ్రులు ఆమెకు తోడుగా నిలవలేకపోయారు.

ఇద్దరూ చదువుకున్నోళ్లే.. 
ఆ అమ్మాయిని చూసే గ్రామంలో పిల్లల ను బడికి పంపాం. ఆమె భర్త విజయ్, అమ్మాయి రేణుక ఇద్దరూ చదువుకున్న వా ళ్లే. ఇతర గ్రామాలకు పంపి ఆలోచన చేసేంటే, తమ కళ్లెదురుగా పిల్లలు చదువుకుంటున్నారని ఆశపడ్డాం. విజయ్‌ చనిపోయాక అమ్మాయికి పాఠశాల రాకుండా ఎలాంటి అనుభవం లేని వ్యక్తి నడిపి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి నుంచి ఒంటరి యువతకి న్యాయం చేయాలని గ్రామస్తులం నిర్ణయించుకొని అండగా నిలబడ్డాం.  
 – లక్ష్మీరెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ ప్రెసిడెంట్,వడ్డేపల్లి

ఎన్నో అవమానాలు భరించా.. 
ప్రేమించి పెళ్లి చేసుకున్నా నని ఇంట్లో వాళ్లు దగ్గరకు రానివ్వలేదు. భర్త స్థాపించిన స్కూల్‌తో సంతోషంగా ఉండేవాళ్లం. ఇద్దరు పిల్లలు అయ్యాక నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వాళ్ల అన్న నన్ను మానసికంగా వేధింపులకు గురిచేశాడు. స్కూల్‌కు రాని్వకుండా, అందులో కనీసం పని కూడా చేయనివ్వకుండా ఇబ్బందిపెట్టాడు. పిల్లల ఆకలి తీర్చేందుకు కూలీ పనులకు వెళ్లాను. నన్ను చూసి గ్రామస్తులు చలించిపోయి.. అండగా నిలిచారు. ఈ రోజు మా స్థలంలో ఉన్న స్కూల్‌ లైసెన్సును అధికారులు రద్దు చేశారు. మళ్లీ నా పేరు మీద ఇస్తే విద్యార్థుల భవిష్యత్‌ను బంగారుమయం చేస్తాను. 
– రేణుక, బాధితురాలు

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)