Breaking News

మహా కుంభాభిషేకం : భక్తజన సంద్రం.. తిరుచెందూరు

Published on Mon, 07/07/2025 - 15:29

సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (Arulmigu Subramania Swamy Temple) ఆరుపడై  వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న  ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన పనులకు హిందూ మత దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జరగనున్నడంతో దేశ విదేశాల నుంచి మురుగన్‌ భక్తులు తిరుచెందూరు వైపుగా కదిలారు. 

ఏర్పాట్లు పూర్తి.. 
కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలు మొదలయ్యాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన  యాగ శాలలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. యాగాలు,హోమాలు విజయవంతంగా పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించ లేదు. ఆలయం ఆవరణలో మూల విరాట్, వళ్లి, దేవానై అమ్మవార్లకుయాగాది పూజలు జరిగాయి. రాత్రి నుంచి వేకువ జాము వరకు 12 కాల యాగ పూజలు జరిగాయి. 

 సోమవారం ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల మధ్య రాజగోపురంలోని తొమ్మిది కుంభ కలశాలలో పవిత్ర జలాలలను పోయనున్నారు. అదే సమయంలో విమాన ప్రకారం, మూల విరాట్, షణ్ముగర్, వళ్లి, దేవానై, పెరుమాల్, నటరాజర్‌ వంటి అన్ని పరివార మూర్తుల గోపురంలోని కలసాలలోపవిత్ర జలాలను పోసి శా్రస్తోక్తంగా కుంభాభిషేక మహోత్సవం పూర్తి చేయడానికి సర్వందం చేశారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తలికించేందుకు వీలుగా సముద్ర తీరం, పరిసరాలలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి ఆలయం పరిసరాలలో విద్యుత్‌ వెలుగులు, సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతు

 

న్నాయి. ఈ మహోత్సవం కోసం రూ.15 లక్షలు విలువగల డ్రై ఫుడ్స్‌తో మాలలను స్వామి, అమ్మవార్ల కోసం సిద్ధం చేశారు.  

తిరుచెందూరులో మహా కుంభాభిషేకం వేడుకకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం జరిగే ఈ వేడుకను కనులార వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతున్నారు. దీంతో నిఘా వలయంలోకి ఆధ్యాత్మిక పట్టణాన్ని తీసుకొచ్చారు.        

నిఘా కట్టుదిట్టం నిఘా నీడలో.. 
భక్తులకు మెరుగైన సేవలే కాదు, భద్రత పరంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ఇలం భగవత్, ఎస్పీ  ఆల్బర్ట్‌ జాన్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మానవ రహిత విమానాలను రంగంలోకి దించారు. సముద్ర తీరంలో జనం చొచ్చుకు వెళ్లకుండబా పెద్ద ఎత్తున రక్షణ కవచంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతుండటంతో ప్రత్యేక బస్టాండ్‌లను ఏర్పాటు చేశారు. తిరుచెందూరు వైపుగా పలు పట్టణాలు,నగరాల నుంచి బస్సులు రోడ్డెక్కించారు. పది లక్షల మంది భక్తులు తరలి రావచ్చు అన్న సంకేతాలతో అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.ఆహారం, తాగునీరు వంటి సౌకార్యలు కల్పించారు. అక్కడక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి