Breaking News

Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్‌ ఎట్రాక్షన్‌, ఎవరీ బాహుబలి

Published on Fri, 01/17/2025 - 16:31

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళా(Maha Kumbh Mela2025) కు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులేకాదు,  సాధువులు కూ విదేశీ ప్రముఖులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.  అయితే ఈ మహా కుంభమేళాలో  రష్యాకు చెందిన "కండరాల బాబా" విశేషంగా నిలుస్తున్నాడు. ఈయన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

కాషాయ దుస్తులు ధరించి, కండలుతిరిగిన దేహంతో  కనిపిస్తున్న  ఈయన స్పెషల్‌   ఎట్రాక్షన్‌గా నిలిచాడు. భుజాన పెద్ద బ్యాగ్‌, మెడలో రుద్రాక్ష మాల,  ముఖంలో కాంతివంతమైన తేజస్సు, ఏడు అడుగుల అందమైన రూపంతో ఈ సాధువు ఆకర్షిస్తున్నాడు. కెవిన్‌బుబ్రిస్కీగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి.

కండల బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్(Atma Prem Giri Maharaj) ఈ "కండల బాబా" రష్యాకుచెందిన వాడు.  ఇపుడు నేపాల్‌లో నివసిస్తున్నాడు.  అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని స్వీకరించాడు. బలమైన శరీరంతో ఉండటంతో చాలా మంది అతనిని పరశురాముడి అవతారంగా పిలుస్తారట. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్.  తన బోధనా వృత్తిని విడిచి పెట్టి మరీ నేపాల్‌లో హిందూ మతాన్ని ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నారు.ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ప్రేమ్‌గిరి మహారాజ్‌ప్రస్తుతం జునా అఖారా సభ్యుడు. ఆత్మ ప్రేమ్ గిరి గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతాడట.

కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రంలో మహాకుంభమేళాఅంగరంగ వైభవంగా జరుగుతోంది. పవిత్ర గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానాలు, "హర హర మహాదేవ" అనే భక్త కోటి నినాదాలతో మహాకుంభమేళా మార్మోగుతోంది.

ఇదీ చదవండి: అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)