Breaking News

Maha Kumbh 2025: పాల్గొన్న ఇండిగో సీఈవో.. మాటల్లో చెప్పలేని శాంతి..!

Published on Thu, 01/30/2025 - 14:04

భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఈ మహా కుంభమేళా. ఇందులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ వేడుకలో ఎందరో ప్రముఖులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. తాజాగా ఇండిగో సీఈవో డచ్‌ ఎగ్జిక్యూటివ్‌ కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆయన ఈ ఉత్సవాన్ని తిలకించి తన అధ్యాత్మిక అనుభవాల తోపాటు అందుకు సంబధించిన ఫోటోలను షేర్‌ చేసుకున్నారు.

ఇండిగోIndiGo) సీఈవో  పీటర్‌ ఎల్బర్స్‌(Pieter Elbers ) లింక్డ్‌ఇన్‌(LinkedIn)లో ఆ సందర్భం తాలుకా ఫోటోల తోపాటు తన అనుభవాన్ని కూడా షేర్‌ చేసుకున్నారు. ఈ డచ్‌ ఎగ్జిక్యూటివ్‌ తాను ఉదయం 5 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేసి.. గందరగోళం నడుమ ఆధ్యాత్మిక శాంతిని పొందానన్నారు. ఈ ఏడాదిలో ఈ మహా కుంభమేళా అద్వితీయమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కేవలం 45 రోజుల్లోనే 450 మిలియన్ల మంది సందర్శకులను తరలివస్తారనేది అంచనా. 

144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలో భూమిపై  ఉండే యావత్తు మానవాళిలో అత్యధిక మంది ఈ అధ్యాత్మిక వేడుకలో చేరి గుమిగూడే సమయం ఇది. ఈ స్థాయిలో అసంఖ్యాక ప్రజలను చూడటం అనేది దాదాపు అసాధ్యం కూడా. ఇది యూరప్‌ జనాభాకు సమానం. పైగాయూఎస్‌ జనసాంద్రతకు మించి అని లింక్డ్‌ ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఎల్బర్స్‌. 

తాను గత వారంలోని గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత వారసత్వ సంగమాన్ని జరుపుకునే మహాకుంభమేళాలో పాల్గొన్నాను అని తెలిపారు. అంతేగాదు ఈ ప్రదేశానికి ఉన్న శక్తిని ఏ వాక్యం, ఏ పదం లేదా చిత్రాలు వర్ణించేందుకు సరిపోవు అని అన్నారు. తాను ఈ త్రివేణి సంగమంలో ఉదయ ఐదు గంటల సమయంలో పుణ్య స్నానాలు ఆచరించానని చెప్పారు. 

మంత్రాలు, ప్రార్థన, భక్తి, మానవత్వం ఐక్యతల నడుమ చుట్టుముట్టిన ఈ గందరగోళం మధ్య ఓ గొప్ప ఆధ్యాత్మిక శాంతిని అనుభవించే క్షణం దొరికిందని ఆనందంగా చెప్పారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ దివ్యమైన గొప్ప అనుభవంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు ఇండిగో సీఈవో. 

అంతేగాదు ఈ కార్యక్రమం కోసం అధికంగా వస్తున్న యాత్రికుల రద్దీని చక్కగా నిర్వహిస్తున్న తమ ఇండిగో బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఈ మొదటి పదిరోజుల్లో పది కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే సంగంలో స్నానాలు ఆచరించారు. అంటే ఈ 45 రోజుల పండుగ ముగిసే సమయానికి ఆ సంఖ్య కాస్తా 40 కోట్లకు చేరుతుందనేది అంచనా.

(చదవండి: 'ది బిలియనీర్స్ డాటర్' ఆ ఒక్క వీడియోతో ఓవర్‌ నైట్‌ స్టార్‌..!)

 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)