Breaking News

మురారి మోపెడ్‌ సంబరం, రూ. 60వేలతో డీజే పార్టీ...కట్‌ చేస్తే!

Published on Wed, 10/16/2024 - 12:50

గోరంత విషయాన్ని కొండంత చేసి చూపించడం లేటెస్ట్‌ ట్రెండ్‌. దీన్నే బడాయి అని కూడా అంటారు. ఇదే ఫాలో అయ్యాడు ఓ బడాయి బసవయ్య.  బ్యాంకు లోన్‌తో బైక్‌  కొనుగోలు చేసి, నానా హంగామా చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అసలు స్టోరీ ఏంటీ అంటే..  

మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన మురారి లాల్ కుష్వాహ  టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అలా వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో ఒక మోపెడ్  కొనుక్కోవాలనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత చేసిన హడావిడే సోషల్‌ మీడియాలో విడ్డూరంగా నిలిచింది. 

బైక్‌ కొనుక్కోవాలనే ఆలోచనరాగానే అందరిలాగానే బ్యాంకును ఆశ్రయించాడు మురారి లాల్. రూ. 90వేల విలువైన టూవీలర్‌ ( టీవీఎస్‌ మోపెడ్‌) కోసం లోన్‌ తీసుకొని, 20వేల రూపాయల డౌన్‌పేమెంట్‌ కట్టాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ. బైక్‌ను తీసుకోవడానికి షోరూమ్‌కు ఏకంగా గుర్రపు బండి, డీజే గ్యాంగ్‌తో తరలి వచ్చాడు. ఆచారం ప్రకారం, కొత్త బండికి  పూలమాలవేసి, పూజలు నిర్వహించాడు. అనంతరం బైక్ ఊరేగింపు  షురూ అయింది.  దోస్తులతో  కలిసి డీజే పాటలకు స్టెప్పులేస్తూ దాదాపు 115 కిలోమీటర్లు   ఊరేగింపు తీశారు. అంతేకాదు బండి అందరికీ కనిపించేలా జేసీబీతో కూడా పైకెత్తించాడు. దీని కోసం మురారి పెట్టిన మొత్తం ఖర్చు అక్షరాలా 60వేల రూపాయలు. పైగా తన పిల్లల సంతోషం కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో వేడుక చేసుకోవడం తనకిష్టమని చెప్పాడు.

ట్విస్ట్‌ ఏంటంటే
ఈ తతంగం అంతా పోలీసులకు చేరింది.  ముందస్తు అనుమతి లేకుండా రహదారిపై అనవసర హ​గామా చేయడమేకాకుండా, డీజేతో శబ్ద, వాయు కాలుష్యానికి కారణమై నారంటూ స్థానిక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురారితో పాటు డీజే ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేశారు.  డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మురారికి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రూ.12,500 పెట్టి ఫోన్ కొని, రూ.25 వేలతో సంబరాలు చేసుకున్నాడట మురారి.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)