Breaking News

ఘనంగా శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు

Published on Thu, 08/10/2023 - 17:15

మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాషా సంస్థ అధ్యక్షులు పి. విజయబాబుగారు, సభ్యులు జి .రామచంద్రారెడ్డి గారు శంకరంబాడి సుందరాచారి గారి చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు విజయబాబుగారు మాట్లాడుతూ.. శంకరంబాడి సుందరాచారిగారు “ మా తెలుగు తల్లికి మల్లె పూదండ “ గీతంలో రాష్ట్రం నలుమూలలా ఉన్న విశేషాలను పొందుపరచి రాష్ట్ర వైభవాన్ని చాటారని, అంతేకాకుండా ఆధునిక ఆంధ్ర కవులలో అగ్రశ్రేణిలో నిలిచే శంకరంబాడి బుద్ధ గీత, అగ్నిపరీక్ష, గీతాంజలి వంటి రచనలతో పాటు సుందరభారతం, సుందర వాల్మీకి రామాయణము వంటి గొప్ప రచనలు అందించిన మహాకవి అనీ. తెలుగు జాతికి తేటగీతులలో అందించిన మధుర కవి అన్నారు.

నటుడిగాను పత్రికారంగంలో ఉపసంపాదకుడిగా, సినీ గీత రచయితగా, అధ్యాపకుడిగా, వివిధ రంగాల్లో తన ప్రతిభాభాటలని పేర్కొన్నారు. శంకరంబాడి గారి నిరాడంబరత, ముక్కుసూటి తత్వం గురుంచి రామ చంద్రారెడ్డి గారు వివరించారు. శ్రీవారి భక్తులైన వీరు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల తిరుపతిలో జీవించారు. ప్రముఖులైన జ్ఞానపిఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ, రాళ్లపల్లి రాయప్రోలు, పుట్టపర్తి వంటి ప్రముఖలైన కవుల ప్రశంసలు అందుకున్నారు.

మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో వీరి రచనలకు తగిన ప్రోత్సాహం లభించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్త, రచయిత్రి శృంగేరి శారద గారు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వంటి ప్రముఖల సమక్షాన కవితలను వినిపించి ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శంకరంబాడి సుందరాచారి అని కొనియాడారు.

(చదవండి: అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు)

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)