Breaking News

లోక్‌సభ ఎన్నికలు 2024: చివరిదాకా ఉత్కంఠ, సత్తా చాటిన వర్షాతాయి

Published on Wed, 06/05/2024 - 11:02

2024 లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో జరిగిన పోరులో మహారాష్ట్ర ఉద్ధవ్ సేన ఎట్టకేలకు తన ఆధిపత్యాన్ని నిరూపించుంది. ముంబై మహా వికాస్ అఘాడి (MVA) కీలక విజయాలను సాధించింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ  పోరు తీవ్ర ఉత్కంఠగా నిలిచింది. ముంబై నార్త్‌లో కాంగ్రెస్ మళ్లీ ఘోర పరాజయాన్ని చవిచూస్తున్న క్రమంలో  ఆ పార్టీ ముంబై అధ్యక్షురాలు  వర్షా గైక్వాడ్   తన  సత్తా చాటారు. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిపై  దాదాపు 16 వేల 514 ఓట్ల తేడాతో గెలుపొందారు.

పాకిస్థాన్‌కు చెందిన అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపులో తొలి ట్రెండ్స్‌లో ఉజ్వల్ నికమ్ ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్లలో తన ఆధిక్యాన్ని చాటుకుని  వర్ష గైక్వాడ్ (49)విజయం సాధించారు.

శివసేన ముంబై సౌత్, సౌత్ సెంట్రల్ , నార్త్ ఈస్ట్ మూడు చోట్ల పోరాడింది. హోరాహోరీగా సాగిన పోరులో ముంబై  నార్త్ వెస్ట్ స్థానం నుంచి అమోల్ కీర్తికర్ విజయం సాధించారు. నార్త్ ముంబై లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌  అభ్యర్థి భూషణ్‌ పాటిల్‌పై కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్ విజయం సాధించారు. ముంబై సౌత్ నియోజకవర్గంలో  ఉద్ధవ్ వర్గానికి చెందిన అరవింద్ సావంత్ షిండేసేనకు చెందిన యామినీ జాదవ్‌పై 52 వేల 673 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఉద్ధవ్ థాకరే విశ్వసనీయ సహచరుడు అనిల్ దేశాయ్ షిండేసేనకు చెందిన రాహుల్ షెవాలేపై 53 వేల 384 ఓట్లతో విజయం సాధించారు.

ఎవరీ వర్షా గైక్వాడ్
ధారవి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత మహిళ. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ఆమె 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా  పనిచేశారు. 2004లో మహారాష్ట్ర 11వ శాసనసభకు తొలిసారి  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)