Breaking News

పెళ్లి పీటలా? సహజీవన బాటలా?

Published on Thu, 11/26/2026 - 04:05

నా వయసు 24 సంవత్సరాలు. బీటెక్‌ పూర్తి చేసి, ఒక  ఐటీ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా జీవించడం నాకు అలవాటు. ప్రస్తుతం మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నాకు వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదు. పెళ్లి చేసుకుని ఒక బంధానికి జీవితాంతం కట్టుబడి ఉండటం కంటే, నా స్వేచ్ఛను కాపాడుకుంటూ నా ఇష్టానుసారం జీవించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నా సహోద్యోగితో లివ్‌–ఇన్‌ రిలేషన్ షిప్‌లో ఉంటున్నాం. మా మధ్య పరస్పర అవగాహన, అంగీకారం ఉన్నాయి. 

మా సంబంధం సంతోషంగా కొనసాగితే జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చి కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఒకరినొకరు బలవంతం చేయకుండా విడిపోవాలని కూడా అనుకుంటున్నాం. అయితే, మా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని అంగీకరించడం లేదు. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి చేస్తున్నారు. వారి భావాలను గౌరవించాలా, లేక నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవించాలా అనే విషయంలో నాకు ఇబ్బందిగా ఉంది. నా తల్లిదండ్రులకు నా నిర్ణయాన్ని అర్థమయ్యేలా ఎలా చప్పాలి?   
– స్నిగ్ధ, హైదరాబాద్‌

పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. పెళ్లి చేసుకోకూడదని అనుకోవడం మాత్రమే మానసిక సమస్యకు సంకేతం కాదు. కొందరు వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. మరికొందరు అవివాహితులుగా స్వతంత్రంగా జీవించాలనుకుంటారు. ఇంకొందరు లివ్‌–ఇన్‌ రిలేషన్ షిప్‌ను ఎంచుకుంటారు. 

ఈ ఎంపికల్లో ఏదో ఒకటి అందరికీ సరైనదని చెప్పలేం. తమ నిర్ణయాల పట్ల అవగాహన, బాధ్యత, పరస్పర గౌరవం ఉండటం ముఖ్యం. మన సమాజంలో వివాహం అనేది కుటుంబ బంధాలు, సామాజిక గుర్తింపు, భవిష్యత్తు భద్రత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల పిల్లలు పెళ్లి చేసుకోనని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందవచ్చు. 

భవిష్యత్తులో తమ కుమార్తెకు తోడుగా ఎవరు ఉంటారు, సంబంధం విఫలమైతే ఆమె ఎలా ఎదుర్కొంటుంది అనే భయాలు వారికి ఉండవచ్చు. అయితే, వాటి పేరుతో పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం లేదా అపరాధ భావన కలిగించడం సరైన పద్ధతి కాదు. లివ్‌–ఇన్‌ రిలేషన్ షిప్‌లో ఉండటం స్వతహాగా తప్పు కాకపోవచ్చు. ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో కలిసి జీవించవచ్చు. అయితే, సంబంధంలో నిజాయితీ, పరస్పర గౌరవం, వ్యక్తిగత హద్దుల పట్ల అవగాహన ఉండాలి. ఆర్థిక బాధ్యతలు, భవిష్యత్తు ప్రణాళికలు, విడిపోవాల్సి వస్తే ఎదురయ్యే పరిణామాల గురించి కూడా ముందుగానే చర్చించుకోవాలి.

మీ తల్లిదండ్రులకు ఫ్యామిలీ  కౌన్సెలింగ్‌ ఉపయోగపడవచ్చు. కౌన్సెలింగ్‌ లక్ష్యం వారిని బలవంతంగా మార్చడం కాదు. వారి ఆందోళనలను అర్థం చేసుకుంటూనే, మీ అభిప్రాయాలను గౌరవించేలా పరస్పర సంభాషణను మెరుగుపరచడం. వారు కౌన్సెలింగ్‌కు అంగీకరించకపోతే, మీరు వ్యక్తిగతంగా కౌన్సెలింగ్‌ తీసుకుని కుటుంబ ఒత్తిడిని ఎదుర్కోవడం, ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం నేర్చుకోవచ్చు. 

అదే సమయంలో, వివాహం పట్ల మీకు ఆసక్తి లేకపోవడానికి కారణాలను మీరు కూడా విశ్లేషించుకోవాలి. మీ నిర్ణయం గురించి ఏవైనా సందేహాలు లేదా మానసిక సంఘర్షణలు ఉంటే కౌన్సెలింగ్‌ ద్వారా స్పష్టత పొందవచ్చు. చివరిగా, వివాహం చేసుకున్నా, చేసుకోకపోయినా, వ్యక్తి తన నిర్ణయాలను బాధ్యతతో తీసుకుంటూ, తనతోపాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించడం ముఖ్యం. తల్లిదండ్రులను గౌరవించడం అంటే వారి ప్రతి నిర్ణయాన్నీ అంగీకరించడం కాదు. అలాగే, పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం అంటే వారి నిర్ణయాలను గౌరవిస్తూనే, అవసరమైనప్పుడు అండగా నిలబడటం ఆరోగ్యకరమైన కుటుంబ బంధానికి పునాది. ఆల్‌ ది బెస్ట్‌ !


డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)