పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని
Breaking News
పోస్టు చేసేముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం!
Published on Fri, 01/23/2026 - 05:49
సోషల్ మీడియా ట్రోలింగ్లు... డిజిటల్ విచారణలు ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయో కేరళలో చోటుచేసుకున్న ఓ ఘటన కళ్లకు కడుతోంది. ఓ మహిళ ఒక వ్యక్తిపై బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపంతో అతను ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది.
35 ఏళ్ల శింజిత ముస్తఫా కేరళకు చెందిన ఒక ఇన్ఫ్లూయెన్సర్. ఇటీవల ఆమె తాను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దీపక్ అనే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేసింది. ఈ వీడియో సుమారుగా 20 లక్షల వ్యూస్‌తో వైరలయ్యింది. నిజానిజాలు తెలుసుకోకుండా నెటిజన్లు పెట్టే కామెంట్లు అతన్ని కలచి వేశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయిన దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వ్యూస్ కోసమేనా?
దీపక్ ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు రాగానే శింజిత సోషల్ మీడియాలో తాను ఆరోపణలు చేసిన వీడియోని డిలీట్ చేయడమే గాక తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోని అప్లోడ్ చేసింది. కానీ అప్పటికే.. వ్యూస్ కోసమే శింజిత ఇలా చేసినట్లు ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వీడియోని కూడా ప్రైవేట్మోడ్లోకి మార్చేసింది. దీనంతటినీ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శింజితను అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది.
ఒక ఇన్ ఫ్లుయెన్సర్‌గా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నవారు చేసే పోస్టుల పర్యవసానాల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని నిపుణులు అభి్రపాయపడుతున్నారు.
Tags : 1