Breaking News

ఇండియన్‌.. కొరియన్‌.. ఓ సినిమా కథ..

Published on Tue, 12/02/2025 - 11:10

కొరియన్‌ డ్రామా, కే–సిరీస్, కే–పాప్, కొరియన్‌ ఫిల్మ్స్‌.. గత కొన్నేళ్లుగా ఇదొక గ్లోబల్‌ ట్రెండ్‌. కొరియన్‌ డ్రామాలకు, యాక్టర్లకు, కొరియన్‌ స్టైల్, ఫ్యాషన్‌కు గ్లోబల్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతెందుకు కొరియన్‌ ఫుడ్‌ కూడా కొత్త ట్రెండ్‌. దేశంతో పాటు హైదరాబాద్‌ నగరంలోనూ విశేష ఆదరణ పొందుతున్న కొరియన్‌ ట్రెండ్‌ నేపథ్యంగా కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రసాద్‌ ఫిల్మ్‌ ల్యాబ్‌లో సోమవారం ప్రారంభమైన ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ప్రముఖ కే–డ్రామా దర్శకుడు, నిర్మాత ‘యూ ఇన్‌షిక్‌’ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొరియన్‌ టెలివిజన్‌ వేదికగా తానొక ఉప్పెన.., ఎక్స్‌ట్రా ఆర్డినరీ అటార్నీ వూ, డాక్టర్‌ రొమాంటిక్, వాగాబాండ్‌ వంటి సిరీస్‌లతో కొరియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి ఫ్యాన్‌బేస్‌ సంపాదించుకున్నారు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ‘యూ ఇన్‌షిక్‌’ సాక్షితో తన అనుభవాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

నేను ఇండియా రావడం ఇదే మొదటి సారి. భారత్‌ ఎంతో వైవిధ్యమున్న దేశం. సంస్కృతి–సంప్రదాయాల పరంగా భారతీయత ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్‌ రాగానే తిన్న బిర్యానీ నచి్చంది. వాస్తవానికి భారత్‌కు కొరియాకు సాంస్కృతికంగా, చరిత్ర పరంగా దగ్గరి పోలికలున్నాయి. సినిమాల పరంగా చూస్తే.. కొరియా సంస్కృతి, ప్రేమ కొంచెం విభిన్నమైనవి. 

నా డ్రామాలకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో ఇంతలా హిట్‌ అవుతాయని అస్సలు అనుకోలేదు. ఓటీటీలు, గ్లోబల్‌ సినిమా వేదిక ద్వారా నా జీవితమే మారిపోయింది. హైదరాబాద్‌ వచ్చాక నా డ్రామాలన్నీ చూస్తున్నారా అని షాక్‌ అయ్యాను. ఫ్యాన్స్‌ కొరియన్‌ సిరీస్‌లు, డ్రామాలు సజెస్ట్‌ చేయమని అడిగారు. వారందరికీ.. నా డా.రొమాంటిక్, యాక్షన్‌ ఫేం వాగాబాండ్‌ చూడమని చెబుతాను. అంతేకాకుండా 60 ఎపిసోడ్స్‌ ఉన్న ఫేమస్‌ కొరియన్‌ సిరీస్‌ జాయింట్‌ డ్రామా రిఫర్‌ చేస్తున్నా.  

ట్రిపుల్‌ ఆర్‌.. త్రీ ఇడియట్స్‌ ఇష్టం..
కల్చరల్‌ షేరింగ్‌లో భాగంగా ఇండియన్‌ సినిమా–కొరియన్‌ సినిమాలు కలిసి పనిచేసే ఆవశ్యకత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద సినిమా మార్కెట్‌ భారత్‌లో ఉంది. ఇక్కడి స్కిల్, టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్‌ ప్రమాణాలు అద్భుతం. హిట్‌ సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌లో భారతీయ నటుడు అనుపమ్‌ త్రిపాఠి నటించారు. మరో కే పాప్‌లో ఇండియన్‌ గర్ల్‌ కూడా చేశారు. 

భారతీయ సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్, త్రీ ఇడియట్స్, వైట్‌ టైగర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుని ఇమాజినేషన్‌ చూసి ఆశ్చర్యపోయా. మా సినిమాల్లోని ఏడుపు, సంతోషం అన్నీ కలిసి రేపు ఎలా బతకాలో నేరి్పస్తాయి. అయితే హింస ఎక్కువుందనుకుంటారు. కానీ సెన్సార్‌ చాలా కఠికంగా ఉంటుంది. స్మోకింగ్‌ సీన్స్‌ అనుమతి కోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది.   

(చదవండి: ‘జయ హో’ ..! ప్రతికూల పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే..!)

#

Tags : 1

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)