Breaking News

ఆశాకు ఆమె నేర్పిన షాహీ కబాబ్‌

Published on Sun, 04/19/2026 - 05:24

ఆశా భోంస్లేకు దుబాయ్, కతార్, సింగపూర్, యూరప్‌లలో ‘ఆశాస్‌’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. అన్నింట్లోనూ ఒక పదార్థం చాలా గిరాకీ. దాని పేరు ‘షాహీ కబాబ్‌’. మెనూ తెరిస్తే షాషీ కబాబ్‌ పక్కన చిన్న అక్షరాల్లో ‘లెర్న్‌›్ట ఫ్రమ్‌ మిసెస్‌ మజ్రూ సుల్తాన్ పురి’ అని ఉంటుంది. ప్రఖ్యాత సినీ కవి మజ్రూ శ్రీమతి బేగంజీ నేర్పిన షాహీ కబాబ్‌ రెసిపీ ఆశాకు ఒక పెద్ద వరంగా మారింది. ఆ వంట మహత్యం కథ ఇది.

ఆశా రికార్డింగ్స్‌తో బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి పిల్లలకు ఏదో ఒకటి వండి పెట్టాలని తల్లిగా కోరుకునేది. ఒక్కోసారి వీలయ్యేది కాదు. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చేసరికి చిన్న కుమారుడు ఆనంద్‌ చాలా హుషారుగా ఉన్నాడు. ‘ఏంట్రా’ అని అడిగితే బజారులో కబాబ్‌ తిన్నాడట... అది తినడం మొదటిసారట... ‘చాలా బాగుంది... ఇక మీదట దానిని చేసి పెడుతుండు’ అని అడిగాడు. కాని ఆశాకు కబాబ్‌ చేయడం రాదు. కబాబ్‌ చేయడం ఎవరు నేర్పిస్తారా అని ఆలోచిస్తే మజ్రూ సుల్తాన్‌పురి శ్రీమతి గుర్తుకొచ్చింది. మజ్రూ స్నేహితులు, బంధువులు అందరూ ఆమెను ‘బేగంజీ’ అని పిలుస్తారు. బేగంజీకి ఫోన్‌ చేసి ‘నా కొడుకు కోసం కబాబ్‌ ఎలా చేయాలో నేర్పిస్తావా?’ అని అడిగింది ఆశా. ‘ఓ అదెంత సేపు... ఇంటికి రా’ అని పిలిచింది బేగంజీ.

అలా మజ్రూ ఇంటికి నాలుగైదుసార్లు వెళ్లిన ఆశా ‘కబాబ్‌’ చేయడం నేర్చుకుంది. అయితే ఆమెకు మెల్లగా ఒక విషయం అర్థమైంది. ముంబైలో ఆ తర్వాత ఎన్నోచోట్ల ఆశా కబాబ్‌ ట్రై చేసినా మజ్రూ శ్రీమతి చూపించిన కబాబ్‌ రుచి వేరు బయట బజారులో దొరుకుతున్న కబాబ్‌ రుచి వేరు. ఏంటా అని ఆలోచించి మళ్లీ మజ్రూ ఇంటికి వెళ్లింది ఆశా. అప్పుడు బేగంజీ నవ్వేసి ‘ఆశా... నీకు నేర్పింది షాబీ కబాబ్‌. అది కేవలం లక్నోలో ఉండే కొందరు నవాబుల ఇళ్లల్లోని స్త్రీలకు మాత్రమే తెలిసిన రెసిపీ. ఆ రెసిపీ రహస్యాన్ని నీకు చెప్పాను’ అంది. 

షాహీ అంటే బాదుషాహీ... రాజస అని అర్థం. అలనాడు ఒక లక్నో నవాబు గారికి నోట్లో పళ్లు లేకపోతే నోట వేయగానే మెత్తగా కరిగిపోయే షాహీ కబాబ్‌ను వంటవాళ్లు కనిపెట్టారట. అలా పుట్టిందా కబాబ్‌. దాని రెసిపీ బేగంజీ దయ వల్ల ఆశా వశమైంది.

బేగంజీ ఆశాకు నేర్పిన పాఠం ఏమిటి? ‘ఆశా... కబాబ్‌ చేయడానికి కావాల్సింది మసాలా కాదు... సబర్‌. అంటే ఓర్పు. రాత్రంతా మాంసాన్ని మసాలాలో నానబెట్టాలి. మెత్తగా రుబ్బిన జీడిపప్పు, గసగసాలు, దహీ, పచ్చి బొప్పాయి... ఇవన్నీ కలిపి 12 గంటలు ఊరనివ్వాలి. తొందరపడితే రుచి రాదు. పాటలాగే వంట కూడా సాధన చేస్తేనే వస్తుంది’ అని చెప్పిందామె. 

తర్వాతి రోజుల్లో ఆశా చేసిన షాహీ కబాబ్‌లు తిన్న భర్త, సంగీత దర్శకుడు ఆర్‌.డి. బర్మన్ ‘ఆశా... నువ్వు పాడటం మానేసినా పర్లేదు. కబాబ్‌లు చేస్తూ బతికేయొచ్చు’ అనేవాడు.  

ఆశా ఇంట్లో పార్టీ జరిగితే మెనూలో షాహీ కబాబ్‌ తప్పనిసరి. అక్కాచెల్లెళ్ల మధ్య ఎన్ని స్పర్ధలు ఉన్నా ఆశా చేసిన కబాబ్‌ని లతా ఇష్టపడేది. ఒకసారి లతాకి నలతగా ఉంటే ఆశా స్వయంగా షాహీ కబాబ్‌ చేసి పంపిందట. తిన్నాక లతా ఫోన్‌చేసి ‘చాలా బాగుంది’ అని ఒక్క మాట అందట. మాటల్లేని తమ మధ్య షాహీ కబాబ్‌ అలా మాట కలిపింది. 

అన్నట్టు కబాబ్‌ వెనక కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆశా చెప్పింది – ‘నేను బాధలో ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్తాను. కబాబ్‌ కోసం మసాలా దంచుతూ, ఉల్లిపాయ కోస్తూ ఏడుస్తాను. కన్నీళ్లు ఉల్లిపాయవే అని అందరూ అనుకుంటారు’ అని. 

ఏమైనా మజ్రూహ్‌ సుల్తాన్ పురి తన కలంతో అక్షరాలకు రుచి అద్దితే, ఆయన భార్య బేగంజీ కబాబ్‌కి రుచి అద్దింది. ఆ రుచిని ఆశా ప్రపంచమంతా పంచుతోంది.                          
– కె

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)