Breaking News

ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?

Published on Sat, 10/04/2025 - 10:15

ఎడమ వైపు తిరిగి నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే..ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు ఎడమ వైపు తిరిగి అసలు నిద్రపోకూడదు.ఇలా నిద్రపోవడం వల్ల అసిడిటీ రిఫ్లక్స్‌ తగ్గిపోతుందని కొందరు చెబుతుంటారు. అయితే..హార్ట్‌ పేషెంట్స్‌ మాత్రం ఇలా పడుకోవడం మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకుందాం...

ఎప్పుడైతే ఎడమ వైపు తిరిగి నిద్రపోతారో అప్పుడు గుండెపైన ఒత్తిడిపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండె కాస్తంత పక్కకు జరిగినట్టుగా అవుతుంది. అదే సమయంలో గ్రావిటీ కారణంగా కిందకు లాగినట్టుగా అవుతుంది. ఈ రెండింటి మధ్య రాపిడి కారణంగా హృదయ స్పందనలో మార్పు వస్తుంది. అందుకే..గుండె జబ్బులు ఉన్న వారు వీలైనంత వరకూ ఎడమ వైపు తిరిగి నిద్రపోవడాన్ని అవాయిడ్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే గుండె జబ్బు లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి. 

ఇక కుడి వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్‌ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే కుడి వైపు తిరిగి పడుకుంటారో అప్పుడు గుండెపైన ప్రెజర్‌ ఎక్కువగా పడదు. ఈసీజీలోనూ ఎలాంటి మార్పులు కనిపించవు. అంటే..హార్ట్‌ రేట్‌ నార్మల్‌ గానే ఉన్నట్టు లెక్క. అందుకే హార్ట్‌ పేషెంట్స్‌ కుడి వైపునకు తిరిగి నిద్రపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్‌

మీరు ఏ పొజిషన్‌ లో నిద్రపోతున్నారనే విషయంతో పాటు ఎన్ని గంటల పాటు క్వాలిటీ స్లీప్‌ ఉంటోందన్నదీ ముఖ్యమే. కుడి వైపు తిరిగి పడుకున్నంత మాత్రాన స్లీప్‌ క్వాలిటీ ఉన్నట్టే అని అనుకోడానికి వీలులేదు. చాలా మంది 5 గంటల పాటు మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రంతా మొబైల్‌ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఉదమయే ఆఫీస్‌ హడావుడి కారణంగా త్వరగా నిద్రలేవాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బ తింటుంది. అప్పటి నుంచి సమస్యలన్నీ మొదలవుతాయి. అందుకే..సరైన విధంగా నిద్ర పట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. 

ఇదీ చదవండి: Nita Amabni క్వీన్‌ ఆఫ్‌ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)