బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
ఇదొక ఫుడ్ లవ్ స్టోరీ..! వంటకానికో కథ..
Published on Fri, 08/01/2025 - 12:00
నగర జీవన వైవిధ్యంలో విభిన్న సంస్కృతులకు చెందిన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగానే దేశంతో పాటు విభిన్న ప్రాంతాలకు చెందిన కాంటినెంటల్ డిషెస్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలోని లీలా–రీన్ ది చెఫ్స్ స్టూడియో బెంగాల్ ప్రెసిడెన్సీ కాలం నాటి వంటకాలకు ఆధునికతను జోడించి ‘ప్రితిర్ కోతా’ రుచులను నగరవాసులకు చేరువ చేస్తున్నారు. ఈ చెఫ్స్ స్టూడియోలో ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఫుడ్ ఫెస్ట్‌లో ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్.. ప్రితిర్ కోతా ఫుడ్ పాప్–అప్‌తో అలరించనున్నారు.
బెంగాల్ ఫుడ్‌కు నగరంలో ఇస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇందులో భాగంగానే ఇక్కడి బెంగాల్ ఫుడ్ లవర్స్‌కు సరికొత్త రుచులను పరిచయం చేయనున్నట్లు ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్ తెలిపారు. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని జాక్‌ఫ్రూట్ కుడుములు మొదలు స్ట్రీట్ క్లాసిక్ ఫుడ్ భెట్కి, ప్రాన్ కబీరాజీ.. రాజ్–యుగ వంటకాలు స్టీమర్ డక్ కర్రీ, ఆల్‌టైమ్ ఫేవరెట్ ధోకర్దల్నా–రాధా బల్లవితో పాటు ఠాకూర్బరిర్ శుక్టో వంటి విభిన్న రుచులను నగరంలో వండి వారుస్తున్నామని తెలిపారు.
ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థి అయిన చెఫ్ గౌరవ్ సిర్కార్.. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ ‘ఓమ్య’, ది బాంబే క్యాంటీన్ వంటి ప్రముఖ సంస్థలతో తన కలినరీ అనుభవాన్ని విస్తరింపజేశారు. ప్రతి వంటకంతో ఒక కథ చెప్పడం అతని పాక శాస్త్ర వైవిధ్యం. ఈ పాప్–అప్ చారిత్రాత్మక కలయికలతో పాటు ప్రాంతీయ రుచులను సమకాలీన భోజన వినూత్నత్వాన్ని మిళితం చేస్తుంది.
(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..)
Tags : 1