Breaking News

ఎడారిలోన పంట పండెనెంత సందడి!

Published on Sun, 10/12/2025 - 09:17

ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!

ఎర్రబడిన ఎడారుల్లో కొత్త ఆశ మొలకెత్తింది. ఆ ఆశ పేరే లారా నార్మన్‌. అమెరికాకు చెందిన ఈ శాస్త్రవేత్త, ఇరవై ఏళ్లుగా ఎడారిలో నీటి జాడల కోసం వెతికేస్తూ చివరకు ఒక రహస్యాన్ని కనుగొన్నారు. ఆ రహస్యం పెద్ద యంత్రం కాదు, క్లిష్టమైన శాస్త్రం కాదు. ప్రకృతి ఇచ్చిన సులభ మంత్రం. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు, కట్టెలు వంటివన్నీ కలిసి నిడ్స్‌ అనే సహజ అడ్డాలుగా మారతాయి. 

ఈ అడ్డాలు నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా, నెమ్మదిగా మార్చి, నేలను తడిగా ఉంచుతాయని లారా గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించి ఆమె అరిజోనా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో చిన్న చెక్‌ డ్యామ్‌లు, రాళ్ల గుట్టలు ఏర్పాటు చేసింది.  మొదట ఇది కేవలం మట్టిని ఆపినట్టే అనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఎండిన నేల తడిగా మారింది. తడిబీడులు పుట్టాయి. పచ్చని చెట్లు మొలిచాయి. పక్షులు తిరిగి వచ్చి కూశాయి. ఇలా ఎడారి గుండెకు మళ్లీ జీవం చేరింది. 

మాయా మట్టీ!
ఎడారి ఇసుకల్లో ఒక్కసారిగా పచ్చని పంటలు పండాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాని, ఇది నిజమే! యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నలభై రోజుల్లోనే ఇసుకమయమైన భూమి కాస్త పచ్చటి తోటగా మారిపోయింది. అంతేగాక, అక్కడి ఎండల్లో తియ్యటి పుచ్చకాయల పంట కూడా పండింది. ఈ అద్భుతానికి కారణం ‘నానోక్లే’. మట్టి, నీరు, స్థానిక ఇసుకల మిశ్రమంతో తయారైన ఈ ద్రవం ఎడారికి ప్రాణం పోసే రహస్య మంత్రంలా పనిచేస్తుంది. 

ఇసుకపై దీన్ని పిచికారీ చేస్తే, ప్రతి ఇసుక రేణువుకు మట్టి కవచం ఏర్పడుతుంది. ఆ కవచం నీటిని పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎండిన నేల తడిగా మారి, వేర్ల దగ్గర పచ్చని జీవం మొలుస్తుంది. ఇలా కొద్ది గంటల్లోనే ఎడారి పచ్చదనంతో మెరిసిపోతుంది. అంతేకాదు, నీటి వినియోగం సగానికి తగ్గిపోవడం, పంటలు వేగంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది. 

ఈ మధ్యనే అబూధాబీలో చేసిన ప్రయోగాల్లో పుచ్చకాయలతో పాటు జుక్కినీ, మిల్లెట్‌ కూడా పండించగలిగారు. కరోనా సమయంలో వచ్చిన ఆ పంటలు స్థానిక కుటుంబాల కడుపులు నింపాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియకు ఖర్చు కొంత ఎక్కువే కాని, భవిష్యత్తులో ఈ సాంకేతికత చౌకగా మారితే ఎడారులన్నీ పచ్చటి పొలాలుగా మారిపోతాయి! 

(చదవండి: పిట్ట మైల్డ్‌.. వేట వైల్డ్‌)

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)