Breaking News

వెరైటీ పండుగ: ‘లాస్‌ ఫల్లాస్‌' బొమ్మలను తయారు చేసి మరీ..!

Published on Sun, 03/16/2025 - 09:40

ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్‌ ఫల్లాస్‌’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్‌ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్‌లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్‌’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.

ఫల్లాస్‌ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్‌బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్‌ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్‌ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు. 

చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. 

(చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)