Breaking News

ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!

Published on Sun, 05/18/2025 - 11:32

‘అద్దె కట్టాలి, కరెంట్‌ బిల్లు కట్టాలి, గ్యాస్‌ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్‌ ఖర్చు, మెడికల్‌ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్‌ అందరూ మ్యానేజ్‌ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్‌ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్‌ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్‌ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. 

అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్‌ లైఫ్‌ ఆఫ్‌ ఏ క్రూజ్‌’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్‌ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 

ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్‌ క్లీనింగ్‌ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్‌ పెట్టుకొని తినడం, ఎంజాయ్‌ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్‌. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు.  

(చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!)

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)