Breaking News

మనసుంటే భూపంపిణీ చేయొచ్చు!

Published on Thu, 08/21/2025 - 11:17

భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. గ్రామాల్లోని సుమారు 10 కోట్ల కుటుంబాలకు, అంటే గ్రామాల్లోని దాదాపు 56 శాతం కుటుంబాలకు సాగు భూమి అనేది లేదు. 

1970 దశకంలో ప్రజల, ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరి గిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే  సీలింగ్‌ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్‌ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది.   శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూ సంస్కరణల చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి, అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగు లను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్‌లోకి రాకుండా తమ భూములను కాపాడుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 51 లక్షల ఎకరాలను మాత్రమే 57.8 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది. 

భూ సంస్కరణల చట్టాల వల్ల భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి ఇంకా కేంద్రీకరించ బడి ఉంది. 2020 జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్‌ కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాల వారిగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బిహార్‌ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10%గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూ కామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. 

దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపారనీ, భూస్వామ్య విధానం లేదనీ, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయనీ, పంచ టానికి ఇంకా భూములు లేవనీ కొందరు చేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధం. భూ కామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూము లను ప్రభుత్వం పంపిణీ చేయగలిగినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్‌ విధించి భూ సంస్కర ణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి.  
– బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)