బొక్కలిరుగుతాయ్‌.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్‌

Published on Sat, 05/31/2025 - 14:50

భారత దేశ పర్యటనకు వచ్చిన  అమెరికన్‌ యూట్యూబర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని  ఈ పరిణామానికి హతాశుడైన అతను తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. కోల్‌కతాలో పర్యటిస్తున్న యూట్యూబర్ డస్టిన్‌  పట్ల స్థానిక టాక్సీ డ్రైవర్‌ దారుణంగా ప్రవర్తించాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని  వేరే హోటల్‌కు తీసుకెళ్లి, ఎక్కువ ఛార్జీ వసూలు చేయాలని చూశాడు. దీంతోతనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను డస్టిన్‌ తన యూట్యూబ్ (Youtube) ఛానల్‌లో అప్‌లోడ్ చేయగా ఇది  వైరల్‌గా మారింది.

ఆనందనగరం కోల్‌కతాను వీక్షించాలని వచ్చిన పర్యాటకుడి మొదటి రోజు పీడకలగా మారిపోయింది.అమెరికన్ వ్లాగర్  డస్టిన్ అనే కోల్‌కతా దర్శించేందుకు వచ్చాడు.  కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్‌లోని గ్రేట్ వెస్టర్న్‌ హోటల్‌కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీ ని బుక్‌ చేసుకున్నాడు.  ప్రయాణ ప్రారంభమైన కొద్దిసేపటికే డ్రైవర్ దారి మళ్లించి, దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజార్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్‌కి తీసుకెళ్లాడు.  పైగా అతనితో వాగ్వాదానికి దిగాడు.   అసలు చార్జీరూ.700 బదులుగా  రూ.900 డిమాండ్ చేశాడు.

ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ యోగాసనాలు

ఇక్కడితో అయిపోలేదు....మరో  వ్యక్తి  (ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి) కల్పించుకొని డస్టిన్‌ను బెదరించడం మొదలు పెట్టాడు. మాఫియాతో తనకు సంబంధాలున్నాయ్‌.ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బొక్కలు ఇరగదీస్తానంటూ రెచ్చిపోయాడు. అయినా డస్టిన్‌ బెదరలేదు. విషయాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా రూ. 1000 డిమాండ్ చేశాడురెండోవాడు. ఆ తరువాత వారు డస్టిన్‌కోసం మరో టాక్సీని బుక్‌  చేశారు. అయితే ఈ సారి "పార్కింగ్ , పెట్రోల్" కోసం అదనంగా రూ. 100 చెల్లించాలని పట్టుబట్టడంతో మొత్తం చార్జీ రూ. 800కి పెరిగింది. ఇందదులో కొత్త డ్రైవర్‌కు కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు. అలాగే 50 నిమిషాలు పట్టాల్సిన ప్రయాణాన్ని 1 గంట 20 నిమిషాలకు పొడిగించారంటూ  డస్టిన్‌   అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన తన భారత్‌పై తనకున్న  అభిప్రాయాన్ని మార్చలేదని, ఇండియా అద్భుతమైన దేశమంటూ పేర్కొన్నాడు. 

చదవండి: నటి భర్త, టైగర్‌ మ్యాన్‌ వాల్మీక్‌ థాపర్‌ ఇకలేరు.. ఎవరీ థాపర్‌?
 

ఈ ఘటనపై నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశానికి ప్రతిష్టకు భంగం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ పర్యాటకుల పట్ల  ఇలా ప్రవర్తించడం మాకు సిగ్గుచేటు  అని ఒకరు,  మ“నేను వీడియో లింక్‌తో కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశా,లాంటి పోకిరితనంపై వెంటనే చర్య తీసుకోవాలని అభ్యర్థించాను’’ అని మరొకరు కమెంట్‌చేశారు. ఆ బెంగాలీ వాలా చాలా మొరటుగా తిట్టుగాడు బెంగాలీని, సారీ అంమూ మరో యూజర్‌  వ్యాఖ్యానించాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో బిధన్‌నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. డ్రైవర్ అలంగీర్ మొల్లా (34), అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ (52)లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)