Breaking News

వందేళ్ల హైకింగ్‌ స్టార్‌..! సెంచరీ వయసులో మొత్తం ఫ్యామిలీతో..

Published on Sun, 10/19/2025 - 08:09

వయసు వంద దాటాక కుర్చీలో కూర్చోవడం బోరుగా అనిపించిందట! జపాన్‌కు చెందిన కోకిచీ అకుజావాకు. దీంతో, వెంటనే హైకింగ్‌ స్టిక్‌ పట్టుకుని, మొత్తం ఫ్యామిలీతో ట్రెక్కింగ్‌ పార్టీ స్టార్ట్‌ చేసి, రికార్డు సృష్టించాడు. 

నిజానికి వందేళ్ల వయసు వరకు బతికి ఉండటమే గగనం అనుకుంటే, అప్పటికీ సజీవంగా ఉండేవారిలో చాలామంది కుర్చీలో కూర్చుని టీవీ రిమోట్‌ కంట్రోల్‌ పట్టుకోవడం తప్ప వేరేమీ చేయలేరు. కాని, 102 ఏళ్ల వయసు నిండిన ఈ బాబాయి మాత్రం రిమోట్‌కి బదులు హైకింగ్‌ స్టిక్‌ పట్టుకుని నేరుగా 12,000 అడుగుల ఫుజీ శిఖరాన్ని అధిరోహించాడు. అంతే కాదు, తన 70 ఏళ్ల కూతుర్ని కూడా ‘హే, లెట్స్‌ గో!’ అంటూ వెంట తీసుకెళ్లాడు. 

అలా మొత్తం ఫ్యామిలీతో కలిసి ఒక పెద్ద పిక్నిక్‌లా ట్రెక్కింగ్‌ పూర్తి చేశారు. మధ్యలో కొంచెం అలసటగా అనిపించినా, స్నేహితులు, కూతురు, మనవరాలు ఇచ్చిన మోటివేషన్‌  ఆయనను మళ్లీ కదిలించింది. మొత్తం రెండు రాత్రులు పర్వత మార్గంలో టెంట్‌ వేసి గడిపి, చివరికి శిఖరాన్ని చేరి, ఆ అపురూప క్షణాలను ఫేస్‌బుక్‌ లైవ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ విజయంతో, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కూడా వెంటనే సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. 

ఇదేం.. మొదటి రికార్డ్‌ కాదు.
నిజానికి, అకుజావా 96 ఏళ్ల వయసులోనూ ఇదే పర్వతాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నూటారెండేళ్ల వయసులో ఫుజీ వైపు అడుగులు వేశాడు. 

‘పర్వతం ముందు అందరూ సమానులే. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అసలు ఆ గేమ్‌’ అంటాడాయన. ప్రస్తుతం ఆయన ఒక వృద్ధాశ్రమంలో వాలంటీర్‌గా గడుపుతూ, ఇంట్లో పెయింటింగ్స్‌ వేస్తూ, ఫ్యామిలీకి కొత్త కొత్త ఆర్ట్‌ రిక్వెస్టులు నెరవేర్చుతూ బిజీగా ఉంటున్నాడు. 

(చదవండి: ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్‌లు, పేస్ట్రీలు ఉండవు..)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)