Breaking News

కిరణ్ రావుకు చికున్‌గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..

Published on Wed, 02/18/2026 - 16:50

బాలీవుడ్‌ చిత్ర నిర్మాత కిరణ్‌ రావు ఇటీవల సోషల్‌ మీడియా పోస్ట్‌లో తనకు చికున్‌గున్యా వచ్చినట్లు తెలిపారు. దాని కారణంగా కనీసం పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాధి తన కీళ్లను ఎంతలా బలహీనపరిచిందో వివరించారామె. అసలు ఈ వ్యాధి అంతలా కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అంటే..

ఆల్ఫావైరస్ అనే దోమ జాతి కారణంగా RNA వైరస్ అయిన  చికున్‌గున్యా మానవ శరీరం లక్ష్యంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గుతుందేమో కానీ..దాని తాలుకా ఇబ్బందులు శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి, ఎదుర్కొంటాం కూడా అంటున్నారు నిపుణులు. అసలు 'చికున్‌గున్యా' అంటేనే వంగి ఉండే భంగిమ అని అర్థం. అంటే మన కీళ్లను, కండరాలపై ప్రభావం చూపి..కదపలేని పరిస్థితికి తీసుకువస్తాయి.

కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..
ఏడిస్ ఈజిప్టి లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ వంటి జాతి దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందట. ఆ దోమకాటు కారణంగా ఈ చికున్‌గున్యా వైరస్‌ రక్తప్రవాహంలోకి ప్రవేశించి కీళ్లలోని బంధన కణజాలం సైనోవియల్ ఫైబ్రోబ్లాస్ట్‌లకు వ్యాపిస్తుంది. దాంతో మనకు శరీరమంతా విపరీతమైన నొప్పులు..నడవాలన్న వణుకు పుట్టడం వంటి సమస్యలు వస్తాయట. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై త్రీవంగా దాడి చేస్తుందట. 

ఫలితంగా శరీరంలో పలుచోట్ల వాపులు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ వైరస్‌ చాలా దూకుడుగా ఉంటుందని, ఒక్కోసారి దీర్ఘకాలిక కీళ్ల వ్యాధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. కొందరిలో రుమటాయడ్‌  ఆర్థరైటిస్‌ బారిన పడేలా చేస్తుందట. అంతేగాదు కొంతమందికి కోలుకున్నాక కూడా పూర్తిస్థాయిలో కదలికలను తిరిగి పొందలేరట. అలాంటి వారికి ఫిజియోథెరపీ అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు. నిరంతర కీళ్లనొప్పి ఈ వ్యాధి ముఖ్య లక్షణంగా చెబుతున్నారు నిపుణులు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. అంటే పూలకుండీలు, ఇంటి బయట ఉండే కంటైనర్లు లేదా డ్రమ్‌లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని

పగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది కాబట్టి..పొడవాటి చేతులు ఉన్న బట్టలు ధరించాలి. దోమల కుట్టకుండా లోషన్‌లు వంటివి రాసుకోవడం చేయాలి. 

అవసరమైతే దోమతెరలు తదితరాలను వాడటం

అలాగే ఇంట్లో ఎవ్వరికైనా చికున్‌గున్యా వస్తే..తక్షణమే దోమల రాకుండా తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.

చివరగా ఈవ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఓపికతో తగిన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దీనికి నిర్ధిష్ట నివారిణి గానీ, టీకా వంటివి లేవని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. త్వరితగతిన కోలుకోవాలంటే మాత్రం..జ్వరం తగ్గేలా మందులు తీసుకుంటూ..వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు పుష్కలంగా తీసుకోవాలి. అలాగే కీళ్లు మరి బిగిసుపోకుండా ఉండేలా సాగదీయడం, ఫిజియోథెరపీ వంటివి తీసుకోవడం వంటివి చేయాని చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)