Breaking News

ఆ యువకుడి టాలెంట్‌కి కిరణ్ మజుందార్-షా ఫిదా..! నెట్‌ లేకుండానే..

Published on Fri, 11/13/2026 - 15:47

Kiran Mazumdar-Shaw Praises: ఏ స్మార్ట్‌ పరికరానికైనా ఇంటర్‌నెట్‌ అవసరం. అది లేకుండా వర్క్‌ అవ్వడం అంత సులభం కాదు. ఈ యువకుడు ఆవిష్కరించిన చిన్న పరికరం మాత్రం ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండానే పనిచేస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది ఎంతో హెల్ప్‌ అవుతుంది. దీన్ని చూసి బయోకాన్‌ వ్యవస్థాపుకురాలు కిరణ్‌ మజుందార్‌ షా సైతం మంత్రముగ్ధురాలైంది. అలెక్సా లేదా గూగుల్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మాదిరి స్మార్ట్‌ హోమ్ లా కాకుండా..రిదిత్‌ కుమావత్‌ అద్భుతమైన స్మార్ట్‌ హోమ్‌ పరికరాన్ని తయారు చేశాడు. 

ఇది ఇంటర్నెట్‌తో పనిలేకుండానే..చక్కగా గదిని నియంత్రిస్తుంది. నెట్టింట అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ చిన్న పరికరం తన గొంతును ఉపయోగించి గది మొత్తాన్ని నియంత్రించగలదని చెబుతున్నాడు రిదిత్‌. ఆఫ్‌లైన్‌లో పనిచేస్తూ..స్టడీ మోడ్', 'గుడ్ నైట్' వంటి ప్రీసెట్‌లతో పనిచేస్తుంది. ఇప్పటి వరకు నిర్మించిన వాటిలో ఇదే అత్యద్భుతమైనదని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ చిన్ని పరికరం ఎలా గది మొత్తాన్ని నియంత్రిస్తుంది కళ్లకు కట్టినట్లు చూపించాడు వీడియోలో. 

లైట్లు ఆపివేయమనగానే..వెంటనే ఆగిపోతాయి. గుడ్‌నైట్‌, స్టడీ మోడ్‌ అనగానే..వాటికి తగినట్లుగా స్పందిస్తుంది. అయితే ఇది ఆఫ్‌లైన్‌లో పనిచేస్తూ గోప్యత ప్రయోజనాన్ని అందిస్తోంది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ యువకుడు కుమావత్‌ వీడియోని చూసి..బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా అబ్బురపడుతూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. 

యువ మేధస్సులు తమ ఉత్సుకతను ఆచరణాత్మక ఆవిష్కరణగా మార్చడం నిజంగా అద్భుతంగా ఉంది. లైట్లు,ఫ్యాన్ల కోసం.. ఇలా రూపొందించిన ఆఫ్‌లైన్‌ వాయిస్‌ నియంత్రిత సిస్టమ్‌ తన మనసుని దోచిందని అన్నారు. ముఖ్యంగా ఇది వృద్ధులకు, దివ్యాంగులకు ఇళ్లలోకి కావాల్సినంత వెసులబాటు అందివ్వగలదు, చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు. అద్భుతమైన ఆలోచనలు రోజువారీ సవాళ్లను ఎలా పరిష్కరించగలవో చెప్పడానికి ఈ ఆవిష్కరణే ఓ ఉదాహరణ.

 

ఇదీ చదవండి: ఈసారి మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల్లో కొత్త కిరీటం..! అదే తొలి కిరీటం..

 

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు