Breaking News

స‌మాన‌త్వం అంటే ఇదేనా?

Published on Tue, 06/17/2025 - 19:47

ఖాన్ సర్.. యూట్యూబ్‌లో చాలా ఫేమ‌స్‌. ఆయ‌న పాఠాలు బాగా చెబుతారు. అంతేకాదు చాలా విష‌యాల గురించి సాధికారికంగా వివ‌రిస్తారు. ఆయ‌న చెప్పే పాఠాలు వినేందుకు విద్యార్థులు అమితాస‌క్తి చూపిస్తారు. ఆయ‌న వీడియోలకు ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌స్తుంటాయి. యూట్యూబ్ ఖాన్ స‌ర్ చాన‌ల్‌కు కోట్ల‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. పుట్టింది యూపీ అయిన‌ప్ప‌టికీ పేరు తెచ్చుకుంది మాత్రం బిహార్‌లో. ఆన్‌లైన్ పాఠాల‌తో ఇప్పుడు ఆయ‌న దేశంలోని విద్యార్థులంద‌రికీ సుప‌రిచితుల‌య్యారు. స‌డ‌న్‌గా ఇప్పుడు ఖాన్ సర్ ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చిందానేగా మీ డౌటు.

తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థ‌కు ఖాన్ సర్ ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. త‌న భార్య గురించి ఆయ‌న వెల్ల‌డించిన విష‌యాలు చ‌ర్చ‌కు దారి తీశాయి. కొంత మంది ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిస్తే, మ‌రికొంద‌రు విమ‌ర్శ‌ల‌కు దిగారు. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన త‌మ పెళ్లి రిసెప్ష‌న్‌లో ఖాన్ సార్ భార్య ముఖాన్ని క‌వ‌ర్ చేస్తూ త‌ల పైనుంచి చీర కొంగు క‌ప్పుకోవ‌డంపై చాలా మంది అభ్యంత‌రం వ్యక్తం చేశారు. తాజా పాడ్‌కాస్ట్‌లో దీని గురించి వివ‌ర‌ణ‌యిచ్చారు ఖాన్ సర్‌.

ర‌హ‌స్యంగా పెళ్లి
గ‌త నెల‌లో ఖాన్ సర్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల కార‌ణంగా ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. పెళ్లి సింపుల్ జ‌రిగిపోవ‌డంతో స్నేహితులు, బంధువులు, స‌న్నిహితుల కోసం కొద్ది రోజుల క్రితం రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. ఈ వేడుక‌లో ఖాన్ సర్‌ భార్య ముసుగు (ఘూంఘాట్) ధరించడం పట్ల చాలామంది ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. వధువు ముఖం కప్పుకోవడాన్ని ప్రశ్నించారు. త‌న పాఠాల్లో స‌మాన‌త్వం, మ‌హిళ‌ల హ‌క్కుల గురించి బోధించే ఖాన్ సర్.. చేత‌ల్లో మాత్రం చ‌తికిల‌ప‌డ్డార‌ని నెటిజ‌నులు ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. భార్య ఇష్టాన్ని గౌరవించార‌ని కొంత‌మంది ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా కామెంట్లు పెట్టారు.

ముసుగు వ‌ద్ద‌న్నా విన‌లేదు..
తాజాగా ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో దీని గురించి ఖాన్ సర్ వివ‌ర‌ణ‌యిచ్చారు. త‌న భార్య ఆమె ఇష్ట‌ప్ర‌కార‌మే ఘూంఘాట్ ధ‌రించింద‌ని, తానేమి బ‌ల‌వంత పెట్ట‌లేద‌ని వెల్ల‌డించారు. ముసుగు ధ‌రించ‌వ‌ద్ద‌ని వారించినా ఆమె వినిపించుకోలేద‌న్నారు.  "వివాహ రిసెప్షన్‌లో ఘూంఘాట్ ధరించడం నా భార్య నిర్ణయం. ఇది తన చిన్ననాటి కల అని, ప్రతి అమ్మాయి ఘూంఘాట్ ధరించి వధువు కావాలని కలలు కంటుందని ఆమె నాతో చెప్పింది. అలా చేస్తే ప్రజలు నన్ను నిందిస్తారని ఆమెతో అన్నాను. ఆమె మనసు మార్చ‌డానికి ప్రయత్నించాను. కానీ ఆమె నా మాట‌ విన‌లేద''ని వివ‌రించారు.

త‌క్కువ టైంలోనే ఫేమ‌స్‌
కాగా, ఖాన్ స‌ర్ (Khan Sir) అస‌లు పేరు పైజ‌ల్ ఖాన్‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని డియోరియా ప్రాంతంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించారు. పాఠ‌శాల విద్యాభ్యాసం త‌ర్వాత అల‌హాబాద్ యూనివ‌ర్సిటీలో బీఎస్సీ, ఎంఎస్సీతో పాటు జియోగ్ర‌ఫీలో ఎంఏ పూర్తి చేశారు. చ‌దువు పూర్తైన త‌ర్వాత బిహార్ రాజ‌ధాని ప‌ట్నాలో కోచింగ్ సెంట‌ర్‌లో టీచింగ్ కెరీర్ మొద‌లు పెట్టారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే వారికి ఆయ‌న బోధించేవారు. త‌క్కువ టైంలోనే త‌న‌దైన‌ టీచింగ్ శైలితో విద్యార్థుల‌ను ఆక‌ట్టుకున్నారు. 

చ‌ద‌వండి: మూడు సంస్థానాలు.. 46 జాగీర్లు

పేద విద్యార్థుల‌కు త‌క్కువ ఫీజుతో నాణ్య‌మైన విద్య అందించాల‌న్న ల‌క్ష్యంతో 2019లో ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంట‌ర్ పేరుతో ప‌ట్నాలో సొంతంగా కోచింగ్ సెంట‌ర్ ప్రారంభించారు. అయితే కోవిడ్‌-19 కార‌ణంగా అది మూత ప‌డింది. త‌న కోచింగ్ సెంట‌ర్ పేరుతోనే యూట్యూబ్‌లో చాన‌ల్ ప్రారంభించి, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్ప‌డం మొద‌లు పెట్టారు. ఆద‌ర‌ణ పెర‌గడంతో 2021లో యాప్ కూడా ప్రారంభించారు. ఖాన్ GS రీసెర్చ్ సెంటర్ యూట్యూబ్ చానల్‌కు 24 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇందులో దాదాపు 400 వీడియోలు ఉన్నాయి.

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)