Breaking News

11 ఏళ్ల రైతు... పండిస్తోంది చూడు...

Published on Sat, 08/30/2025 - 10:20

11 ఏళ్ల పాప ఏం చేస్తుంది? స్కూల్‌కెళ్లి, ఇంటికొచ్చి, హోం వర్క్‌ చేసుకుని, తోటి పిల్లలతో ఆడుకుంటుంది. లేదంటే టీవీ ముందు కూర్చుని రకరకాల ప్రోగ్రామ్స్‌ చూస్తుంది. అయితే కేరళ రాష్ట్రం కన్నూర్‌కు చెందిన వైఘశ్రీ మాత్రం మొక్కలతో దోస్తీ కడుతోంది. రకరకాల కూరగాయలు పండిస్తూ అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంటోంది. 

అసలీ ఇష్టం ఎలా మొదలైంది? వైఘశ్రీ తండ్రి ఓ హోటల్‌ యజమాని. 2019లో ఆయనకు ఓ ప్రమాదం జరిగింది. ఆ నొప్పి నుంచి నుంచి  కోలుకునే క్రమంలో మొక్కలను పెంచడం మేలు చేస్తుందని కొందరు ఆయనకు సలహా ఇచ్చారు. దీంతో ఆయన తన ఇంటి పెరట్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు. 

ఆ సమయంలో వైఘశ్రీకి ఐదేళ్లు. తండ్రి చేసే శ్రద్ధగా గమనిస్తూ ఉండేది. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేవరకు తండ్రికి తోటపనిలో సాయం చేస్తూ గడిపేది. ఆ తర్వాత తండ్రి సాయం లేకుండా తనే అన్నీ స్వయంగా చేయడం ప్రారంభించింది. తన ఆసక్తిని గమనించి తండ్రి ఆమెను మరింత ప్రోత్సహించాడు.

మొక్కలు నాటడం, నీళ్లు నోయడంతోనే వైఘశ్రీ ఆగి΄ోలేదు. మొక్కల సంరక్షణ, విత్తనశుద్ధి, మేలు రకాలు పండించడం, సేంద్రియ ఎరువులు వంటి అంశాలు తెలుసుకునేందుకు అనేక యూట్యూబ్‌ వీడియోలను చూస్తుంది. ఆ నేలలో ఎలాంటి విత్తనాలు పనిచేస్తాయి, తెగుళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుంటుంది. తమకున్న 8 సెంట్ల స్థలంలో ప్రస్తుతం వైఘశ్రీ అన్ని రకాల కూరగాయలనూ పండిస్తోంది. 

వాటిని ఎక్కడా అమ్మదు. ఇంట్లోకి వాడగా మిగిలినవి తోటివారికి, అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేస్తుంది. తన పాఠశాలలో నడిచే మధ్యాహ్న భోజనానికి సైతం కూరగాయలను అందిస్తుంది. వైఘశ్రీ కృషికి గుర్తింపు పంచాయతీ అధికారులు రెండుసార్లు ‘కుట్టి కర్షక’ (చిన్నారి రైతు) పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. 

(చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!)

#

Tags : 1

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)