Breaking News

సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..

Published on Fri, 05/09/2025 - 14:26

ఇటీవల కాలంలో అందంగా, నాజుగ్గా ఉండేందుకే అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు అతివలు. అందుకోసం ఎలాంటి కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకునేందుకైనా వెనకాడటం లేదు. అలాంటి సౌందర్య చికిత్స చేయించుకునే ఓ మహిళ వేళ్లను కోల్పోయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుగా.. పాపం  ఆ మహిళకు తీవ్ర బాధనే మిగిల్చింది ఆ కాస్మెటిక్‌ సర్జరీ.

అసలేం జరిగిందంటే..తిరువనంతపురం జిల్లా, కజకూట్టం సమీపంలోని తంపురాన్ముక్కులోని కాస్మెటిక్ హాస్పిటల్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తిరువనంతపురంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎంఎస్‌ నీతు రెండు నెలల క్రితం ఫిబ్రవరి 22న క్లినిక్‌లో కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. ప్రసవం తర్వాత సాధారణంగా పొట్ట ఒదులుగా బెల్లీ పొట్టలా మారుతుంది కొదరికి. ఇక్కడ నీతుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో.. ఉదర కొవ్వు తీయించుకునే కాస్మెటిక్‌ సర్జరీ లైపోసక్షన్‌ని చేయించుకుంది. 

సర్జరీ జరిగిన మరుసటి రోజే నీతూని డిశ్చార్జ్‌ చేసి పంపించేశారు వైద్యులు. ఆ తర్వాత నుంచి ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకటే తలతిప్పడం..తీవ్ర బలహీనత, నీరసం వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. వైద్యులను సంప్రదిస్తే..జావా, ఓట్‌మీల్ వంటివి తీసుకోవాలని సూచించారు. అయితే ఆమె పరిస్థితి మెరుగవ్వక పోగా, అంతకంతకు విషమించడం మొదలైంది. 

దీంతో హుటాహుటినా సదరు కాస్మెటిక్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి చూసి..పది యూనిట్ల రక్తం కూడా ఎక్కించారు. అయినా ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో..మరొక ఆస్పత్రికి రిఫర్‌ చేశారు వైద్యులు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అక్కడ సుమారు 22 రోజుల అనంతరం కోలుకుంది. నీతు చేయించుకున్న లైపోసక్షన్‌ తీవ్ర ఇన్ఫెక్షన్‌ సమస్యలు కలిగించి..పరిస్థితి దిగజారిపోయేలా చేసిందని చెప్పారు వైద్యులు. 

అంతేగాదు ఆమెకు త్వరితగతిన నయం అయ్యేలా ఎడమ పాదం ఐదు వేళ్లు, ఎడమ చేతి నాలుగు వేళ్లను తొలగించినట్లు తెలిపారు వైద్యులు. దీంతో కుటుంబ సభ్యులు సదరు కాస్మెటిక్‌సర్జరీ నిర్లక్ష్యం కారణంగానే నీతుకి ఈ పరిస్థితి ఎదురైందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే ఆమెకు సర్జరీ చేసిన డాక్టర్ షెనాల్ శశాంకన్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగింది. 

ఇక విచారణలో సదరు కాస్మెటిక్‌ ఆస్పత్రి చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ లేకుండానే ఈ క్లినిక్‌ నిర్వహిస్తుందని తేలింది. దీంతో ఆ క్లినిక్‌ని మూసివేసేలా నోటీసులు జారీ చేశారు. కాగా, గతంలో కొందరు ఇలాంటి సౌందర్య చికిత్సలు చేయించుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలానే వెలుగు చూశాయి. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: యుద్ధ చర్య కాదు..! ఆపరేషన్‌ సిందూర్‌పై పాక్‌ వ్యక్తి ప్రశంసల జల్లు)
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)