Breaking News

వయనాడ్‌ : అంతులేని విషాదంలో ఆనంద క్షణాలు, వైరల్‌ వీడియో

Published on Mon, 08/05/2024 - 12:45

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం పెను విషాదాన్ని సృష్టించింది. కుటుంబాలకు కుటుంబాలు నాశనమై పోయాయి. సొంతవారు, పొరుగువారు ఇలా సర్వం పోగొట్టుకుని గుండెలవిలసేలా కొందరు రోదిస్తోంటే, తోడును, ఉన్నగూడును కోల్పోయి మరికొంతమంది బిక్కుబిక్కుమంటున్నారు.  దీనికి సంబంధించిన విషాద కథనాలు, ఫోటోలు మనల్ని కలచివేస్తున్నాయి. ఇంతటి విషాదంలోనూ మనసుకు స్వాంతన కలిగించే కథనాలు కూడా కనిపిస్తున్నాయి.  తాజాగా అలాంటి ఒక సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వయనాడ్‌లో విషాదంలో మనుషులతో పాటు అనేక మూగజీవాలు అతలాకుతలమైపోయాయి. పెంపుడు జంతువులు తమ వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో, ఎటు పోవాలో తెలియక అల్లాడిపోయాయి. అలా తమ యజమాని కోసం విశ్వాసానికి మారుపేరైన ఒక కుక్క  ఆశగా ఎదురు చూసింది. కళ్లు కాయలు కాచేలా ఆరు రోజులపాటు  వెదికింది.  ఇక కనిపించవా అమ్మా అన్నట్టు కంట నీరు పెట్టుకుంది. చివరికి దాని ఎదురు చూపు ఫలించింది. ఆనందమైన ఆ క్షణాలు రానేవచ్చాయి. అంతే.. ఆనందంతో ఎగిరి గంతేసింది. యజమానిని చూసిన ఆనందంతో ప్రేమతో తోక ఊపుకుంటూ, ఆమెను చుట్టేసుకుంది.  కళ్లు చెమర్చే ఈ దృశ్యాలు  నెట్టింట్‌ వైరల్‌గా మారాయి. 
 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు